Ram Charan: 'పెద్ది'లో ఆ సీన్లు కట్.. జాన్వీ పాత్రపై ట్రోలింగ్‌తో బుచ్చిబాబు క్షమాపణలు!

Ram Charan: 'పెద్ది'లో ఆ సీన్లు కట్.. జాన్వీ పాత్రపై ట్రోలింగ్‌తో బుచ్చిబాబు క్షమాపణలు!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబోలో వచ్చిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లేటెస్ట్ గా ఒక అనూహ్య వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను డిజైన్ చేసిన తీరు, కొన్ని రొమాంటిక్ సీన్స్‌పై నెటిజన్లు, మహిళా సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను కించపరిచేలా చూపించారంటూ దర్శకుడు బుచ్చిబాబుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

బుచ్చిబాబు ఎమోషనల్ పోస్ట్..

విమర్శలు తీవ్రం కావడంతో దర్శకుడు బుచ్చిబాబు సన స్పందించారు. తన ఎక్స్ ఖాతాలో సుదీర్ఘమైన క్షమాపణల లేఖను పోస్ట్ చేశారు. వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.  ఒక ఫిల్మ్‌ మేకర్‌గా ప్రేక్షకులను అలరించడం, వారిని భావోద్వేగంగా కనెక్ట్ చేయడమే నా లక్ష్యం. ఎవరి మనోభావాలనైనా గాయపరచడం నా ఉద్దేశం కాదు అని తెలిపారు. తెరపైనా, తెరవెనుకా నాకు మహిళల పట్ల అపారమైన గౌరవం ఉంది. 'పెద్ది' సినిమాలో కొన్ని సన్నివేశాలు మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేసినట్లు నా దృష్టికి వచ్చింది. అందుకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తూ, ఆయా వివాదాస్పద సన్నివేశాల్లో మార్పులు చేస్తామని చెప్పారు.

ఆ సీన్లు పూర్తిగా అవుట్!

భవిష్యత్తులో కూడా మహిళల పాత్రలను మరింత గౌరవప్రదంగా, శక్తివంతంగా చూపించే కథలనే చెప్పేందుకు కట్టుబడి ఉన్నామని బుచ్చిబాబు తెలిపారు. అయితే సినిమాలో వివాదానికి కారణమైన జాన్వీ కపూర్‌కు సంబంధించిన కొన్ని గ్లామరస్, రొమాంటిక్ సీన్లను థియేట్రికల్ వర్షన్ నుండి పూర్తిగా తొలగించన్నారని  ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి సమాచారం.

ALSO READ : పెద్ది కలెక్షన్ల వర్షం.. రామ్ చరణ్‌‌ కెరీర్ బెస్ట్‌‌ ఓపెనింగ్స్‌‌

ఒక వైపు సినిమా వందల కోట్ల వసూళ్లతో దూసుకుపోతున్నా, ప్రేక్షకుల సెంటిమెంట్స్‌ను గౌరవించి రన్నింగ్ సినిమా సీన్లను ట్రిమ్ చేయడం టాలీవుడ్‌లో ఇప్పుడు సంచలనంగా మారింది. బుచ్చిబాబు తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంపై ఇండస్ట్రీలో ప్రశంసలు కురుస్తున్నాయి. తప్పును ఒప్పుకుని సరిదిద్దుకోవడంలోనే అసలైన దర్శకుడి విజయం ఉందంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ మార్పుల తర్వాత 'పెద్ది' బాక్సాఫీస్ వేట ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి..