గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' (Peddi). 2026 మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలింగా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది . జూన్ 3న ప్రీమియర్స్ షో పడనుంది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ చరణ్ తన డైరెక్టర్ బుచ్చిబాబుపై కురిపించిన ప్రశంసలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
రాసిపెట్టుకోండి.. ఇది పక్కా..
నా మాట రాసి పెట్టుకోండి.. రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమాలోనే టాప్ 4 డైరెక్టర్లలో బుచ్చిబాబు ఒకడిగా నిలుస్తారని రామ్ చరణ్ కొనియాడారు.. చూడ్డానికేమో తను 55-60 కేజీల బరువుతో చాలా సన్నగా ఉంటాడు కానీ, అతని మైండ్ మాత్రం ఒక ఏనుగంత పెద్దది. మనకున్న బెస్ట్ 'సరస్వతీ పుత్రుల్లో' బుచ్చిబాబు ఒకడు. నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన తను, ఇలాంటి ఒక అద్భుతమైన కథను రాయడం నిజంగా నమ్మశక్యం కాని విషయం అని రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్ చేశారు.
ఈ పెద్ది చిత్రంలో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది. ఒక సాదాసీదా విలేజ్ క్రికెటర్ నుండి పవర్‌ఫుల్ పెహల్వాన్ గా చరణ్ చూపించబోయే మేకోవర్, ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ , సాంగ్స్ ఫ్యాన్స్ అంచనాలను రెట్టింపు చేశాయి.
బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సునామీ..
సినిమాపై ఉన్న క్రేజ్ ఎలాంటిదో అడ్వాన్స్ బుకింగ్స్ చెప్తున్నాయి. నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే లక్ష డాలర్ల మార్క్‌ను దాటేసి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఆల్రెడీ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా "చికిరి చికిరి" సాంగ్ 200 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతుండగా, "రై రై రా రా" సాంగ్ మాస్ ఆడియన్స్‌ను ఊపేస్తోంది.
►ALSO READ | నటి ఖుష్బూ ఇంటిలో పెళ్లి సందడి.. పీఎం మోదీని ఆహ్వానించిన సుందర్ ఫ్యామిలీ!
వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ భారీ పాన్-ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నారు. రామ్ చరణ్ నమ్మకాన్ని బట్టి చూస్తే, బుచ్చిబాబు 'పెద్ది'తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోందని ఫ్యాన్స్ , సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
