సీనియర్ స్టార్ హీరోయిన్, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆమె పెద్ద కుమార్తె అవంతిక త్వరలోనే శ్రవణ్ శ్రీనివాసన్ అనే యువకుడితో ఏడడుగులు వేయబోతోంది. ఈ క్రమంలో ఖుష్బూ ఫ్యామిలీ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఖుష్బూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మోదీకి వివాహ ఆహ్వాన పత్రిక..
లేటెస్ట్ గా ఖుష్బూ, ఆమె భర్త, ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ సి, కాబోయే వధూవరులు అవంతిక-శ్రవణ్‌లతో కలిసి పీఎం మోదీని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారికి సాదరంగా స్వాగతం పలికారు. పెళ్లి పత్రికను అందుకున్న మోదీ.. కాబోయే కొత్త జంటను నిండు మనసుతో ఆశీర్వదించారు. తన బిజీ షెడ్యూల్‌లోనూ తమకు సమయం కేటాయించినందుకు ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు.
ఎమోషనల్ పోస్ట్..
గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీని ఢిల్లీలో కలవడం మాకు దక్కిన గొప్ప గౌరవం. నా భర్త సుందర్ సి, నేనూ కలిసి మా కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందజేశాం. ప్రధాని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఖుష్బూ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఈ ఫోటోల్లో ఖుష్బూ ట్రెడిషనల్ పింక్ సిల్క్ శారీలో మెరిసిపోగా.. అవంతిక-శ్రవణ్ జంట ఎంతో క్యూట్‌గా కనిపించారు. ఒకప్పుడు వెండితెరపై స్టార్‌గా వెలిగి, ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా దూసుకుపోతున్న ఖుష్బూ.. పొలిటికల్ అండ్ సినీ గ్లామర్‌ను కలగలిపి తన కూతురి పెళ్లిని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్తున్నారు. మొత్తానికి పీఎం మోదీ స్వయంగా బ్లెస్సింగ్స్ ఇవ్వడంతో ఈ మెగా వెడ్డింగ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఈ క్రేజీ కపుల్‌కు అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు..
ALSO READ : ఇండస్ట్రీ పెద్ద దిక్కుకే ఈ పరిస్థితా?
