గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపేటలోని స్వయంభూ శ్రీ మానసాదేవి, అపురూప లక్ష్మి ఆలయంలో అమ్మవారి ఒడి బియ్యం, చీరలకు రికార్డు ధర లభించింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వేలంపాట నిర్వహించారు.
భక్తుల పోటాపోటీల మధ్య జరిగిన వేలంలో బత్తుల మల్లయ్య,-రాజవ్వ దంపతులు రూ.17.80 లక్షలకు ఒడి బియ్యం, చీరలను దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఇదే రికార్డు ధర అని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
