శ్రీకాంత్, లయ జంటగా రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో జి. నాగేశ్వర్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘మిస్టర్ మిడిల్‌క్లాస్’. జులై 17న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని టీమ్ తెలియజేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘సరదాగా థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకుల మధ్య ఎంజాయ్ చేసి చాలా సంవత్సరాలు అయింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
ఇంత మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చేశామనే ఆనందం ఉంది. ఇదొక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్. భక్తుడికి, భగవంతుడికి మధ్య జరిగే కథను చాలా ఆసక్తికరంగా చూపించాం’ అని అన్నారు. ఈ సినిమా కలెక్షన్స్ చూసి చాలా ఆనందంగా ఉందని, రోజు రోజుకి థియేటర్స్, షోస్ కూడా పెరుగుతున్నాయని దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి, నిర్మాత చందు అన్నారు. ఈ సక్సెస్‌లో భాగమవడం సంతోషంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, డీవోపీ అంజి చెప్పారు.
