తెలుగు సినీ సామ్రాజ్యాన్ని దశాబ్దాల పాటు ఏలిన 'దర్శకరత్న' దాసరి నారాయణరావు వర్ధంతి (మే 30) వేళ సోషల్ మీడియాలో ఒక ఊహించని షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా నిలిచి, అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన ఒక మహోన్నత వ్యక్తి సమాధి.. నేడు సంరక్షణ లేక పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయి కనిపించడం టాలీవుడ్‌ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. చేవెళ్లకు వెళ్లే మార్గం లో ఉన్న దాసరి సమాధిని వద్ద ఈ హృదయవిదారక దృశ్యాలను ఒక యాంకర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
అభిమానుల ఆవేదన..
150 చిత్రాల దర్శకుడు, 53 సినిమాల నిర్మాత, 250 పైగా చిత్రాలకు రచయితగా సినీ ప్రపంచాన్ని శాసించిన లెజెండ్ సమాధికి ఈ గతి పట్టడంపై అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల ఆస్తులు, అంతటి పేరున్న మహానుభావుడిని కన్నవారే మరిచిపోయారా? అంటూ దాసరి వారసులపై, ఆయన పెట్టిన భిక్షతో ఈరోజు ఇండస్ట్రీలో సెటిల్ అయిన కొందరు సెలబ్రిటీలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
రంగంలోకి మంచు మనోజ్..
అయితే, ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో ఇండస్ట్రీ వర్గాలు తక్షణమే అలెర్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఈ విజువల్స్ చూసి తీవ్రంగా చలించిపోయిన హీరో మంచు మనోజ్ వెంటనే రంగంలోకి దిగారు. దాసరి వర్ధంతి రోజైన నేడే నేరుగా చేవెళ్లలోని ఆయన సమాధి వద్దకు చేరుకున్నారు. ఒక జనరేషన్‌కు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి స్మారకం ఇలా ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని స్వయంగా శుభ్రం చేయించారు. అనంతరం దాసరి, పద్మ గార్ల విగ్రహాలకు నమస్కరించి నివాళులు అర్పించారు.
ఈ ఘటన సినీ పరిశ్రమలో మనుషుల విలువపై తీవ్ర చర్చకు దారితీసినప్పటికీ.. సమయానికి స్పందించి లెజెండ్ గౌరవాన్ని కాపాడిన మంచు మనోజ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు..
🏛️ దాసరి సమాధి పునరుద్ధరణకు రంగంలోకి సినీ వర్గాలు
— ముచ్చట్లు (@muchatlu_) May 30, 2026
🔸 దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై వార్తలు రావడంతో సినీ వర్గాల్లో స్పందన కనిపించింది.
🔸 మంచు మనోజ్ అనుచరులు అక్కడికి చేరుకుని సమాధి పరిసరాల్లో క్లీనింగ్ పనులు ప్రారంభించారు.
🔸 సమాధి ప్రాంతాన్ని శుభ్రపరిచి, నిర్వహణ పనులను… pic.twitter.com/Fdf0Gttt4G
