నీట్ పేపర్ లేకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ముట్టడి రెండో రోజు కూడా కొనసాగుతుందని ఆ పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. యువత, విద్యార్థుల కోసం పోరాటం కొనసాగుతుందని మంగళవారం (జులై 21) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చర్చల కోసం సర్కారే జంతర్ మంతర్ దగ్గరికి రావాలని.. తాము వెళ్లే ప్రసక్తే లేదని తెలిపారు.
ఛలో పార్లమెంట్ సందర్భంగా సోమవారం గాయపడ్డ ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. గాయపడ్డ వారు మెసేజ్ చేస్తే వ్యక్తిగతంగా మాట్లాడతానని.. క్షమాపణ చెబుతానని దీప్కే అన్నారు. పోలీసుల చేతుల్లో దారుణంగా గాయపడి మహిళలకు క్షమాపణలు చెబుతున్నట్లు చెప్పారు.
పోలీసుల అమానవీయ దమన కాండను దీప్కే ఖండించారు. నిరసన కారులను కాపాడేందుకు ఇంకా ఉత్తమ మార్గంలో ఆలోచించాల్సిందని అన్నారు. 20 మంది మృతికి కారణమైన ఒకే ఒక్కడు ధర్మేంద్ర ప్రధాన్ ను కాపాడేందుకు ప్రభుత్వం ఎందరో విద్యార్థుల రక్తాన్ని కళ్ల చూస్తోందని విమర్శించారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వల్లే 20 మంది విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు. ధర్మేంద్ర ప్రదాన్ ను హౌస్ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
గాయపడ్డ వారికి క్షమాపణ చెబుతానన్న దీప్కే
రంణరంగం:
ఇక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ ఢిల్లీ రణరంగంలా మారిపోయింది. తొలి రోజు నిరసనల్లో అత్యధిక సంఖ్యలో పాల్గొన్న సీజేపీ మద్ధతు దారులు.. పోలీసుల లాఠీచార్జీ, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో దాడి చేసిన.. వెనుదిరగలేదు. ఒంటిపై లాఠీ దెబ్బతో రక్తం చిమ్ముతున్నా.. ఇండియా భవిష్యత్తు కోసం ప్రాణాలు పోయినా పర్లేదు అంటూ నిరసనల్లో పాల్గొన్నారు.
కేరళ హౌస్ దగ్గరికి సీజేపీ దీక్ష:
ఛలో పార్లమెంట్ కు పిలుపున్చిన సీజేపీ రెండో రోజు కూడా కొనసాగుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఆందోళనల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో సీజేపీ మద్ధతు దారులు జంతర్ మంతర్ వద్దకు వ చ్చారు. అయితే ప్రొటెస్టుకు అనుమతి లేదంటే పోలీసులు నిర్బంధాలు విధిస్తున్నారు. సీజేపీ దీక్ష స్థలాన్ని మూసివేయడంతో.. దీక్షా స్థలాన్ని కేరళ హౌస్ దగ్గరకు మార్చారు.
మరోవైపు సోమవారం పోలీసుల లాఠీచార్జి, టియర్ గ్యాస్ దాడులలో గాయపడిన వారికి ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు.
