దుబాయ్లో ఘనంగా మహంకాళి బోనాలు

దుబాయ్లో ఘనంగా మహంకాళి బోనాలు

గంగాధర, వెలుగు: దుబాయ్​లోని ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్ అల్ ఖైమా మైత్రి ఫార్మ్స్‌‌‌‌లో ఆదివారం మహంకాళి అమ్మవారి బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. యూఏఈలోని పలు ఎమిరేట్స్‌‌‌‌ నుంచి సుమారు 400 మంది తెలంగాణ ప్రవాసులు కుటుంబ సమేతంగా హాజరై పూజలు చేశారు. నాలుగోసారి నిర్వహించిన ఈ వేడుకలో గౌరమ్మ పూజ, బోనాల సమర్పణ, కుంకుమార్చన, మహాహారతి, దీపోత్సవం ఆకర్షణగా నిలిచాయి. మహిళలు తలపై బోనాలు ఎత్తుకుని ఊరేగింపు చేపట్టారు. ముఖ్యఅతిథిగా మైత్రి గ్రూప్ వ్యవస్థాపకుడు కొత్త జయపాల్​ రెడ్డి హాజరై విదేశాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేస్తున్న ఈటీసీఏ సభ్యులను అభినందించారు. 

కార్యక్రమంలో ఈసీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు పీచర కిరణ్​కుమార్, అధ్యక్షుడు చీటి జగదీశ్​రావు, ఉపాధ్యక్షుడు ఎలిగేటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోట్ల రాణి, సంయుక్త కార్యదర్శి శేఖర్​గౌడ్, కోశాధికారి తిరుమల్​రావు, మాజీ అధ్యక్షుడు రాధారపు సత్యం, సీనియర్ సభ్యులు వెంకటేశ్వర్​రావు, కస్తూరి, సురేశ్​రెడ్డి, కార్యవర్గ సభ్యులు వినోద్ ఆచారి, రఘు, రాము, సామ శ్రీనివాస్​రెడ్డి, రాజేశ్, కిరణ్, సారిక, మమత, అన్నపూర్ణ, మౌనిక గౌడ్, మధుకుమార్, వనజ, రనీషా, విపుల, స్వప్న, దీపిక తదితరులు పాల్గొన్నారు.