జూలై 24న ఓయూలో జాబ్ మేళా

జూలై 24న ఓయూలో జాబ్ మేళా

హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగుల కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 24న  జాబ్ మేళా నిర్వహించనుంది.  అపోలో ఫార్మసీలో ఖాళీగా ఉన్న 100 ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి వర్సిటీలోని ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ఈ ఇంటర్వ్యూలను ఏర్పాటు చేసింది. ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ జాబ్ మేళాకు అర్హులని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు అర్హతను బట్టి నెలకు రూ.12,500 నుంచి రూ.25,000 వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలతో నేరుగా హాజరు కావాలని సూచించారు. ఇతర పూర్తి వివరాల కోసం అపోలో ఫార్మసీ హెచ్ఆర్ ప్రతినిధి టి. రఘుపతిని 82476 56356 నంబరులో సంప్రదించాలని కోరారు.