జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ జంటగా అజయ్ భూపతి రూపొందించిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రాగా, సోమవారం ఈ చిత్రం నుంచి హార్ట్ టచ్చింగ్ లవ్ మెలోడీని రిలీజ్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ పాటకు నాగ్ అర్జున్ రెడ్డి అందమైన లిరిక్స్ రాయగా, కపిల్ కపిలన్ పాడిన తీరు ఆకట్టుకుంది.
‘రావే ఇటు రావే నా చెలియా.. నా ప్రాణం నన్ను వీడి నీవైపే కదిలేనే.. రావే ఇటు రావే నా చెలియా ఇటు రావే.. ఏకాంతం చెరలోనే బందీనై ఉన్నానే.. కాలం అడ్డున్నా, ఏ గాయం కోస్తున్నా, నీకై వేచున్నా నువ్వు రావని చెబుతున్నా, నువ్వు లేకుంటే నేనంటూ ఉన్నా లేనట్టేగా, విరహాన్నే నాలో మోస్తూ బ్రతికున్నా భారంగా.. ’ అంటూ సాగిన పాటలో జై కృష్ణ, రాషా తడానీ మధ్య ప్రేమ, దూరమైనప్పుడు కలిగిన ఎమోషన్స్ ప్రేక్షకులను హత్తుకునేలా ఉన్నాయి. విజువల్స్ కూడా పాట ఎమోషన్‌ని మరింత ఎలివేట్ చేశాయి. మోహన్ బాబు, నరేష్, బ్రహ్మాజీ, కిక్ శ్యామ్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జులై 30న విడుదల కానుంది.
