
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా, బింబిసారా దర్శకుడు వశిష్ట(Vassishta) దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. మెగా156(Mega156) అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్నారు ఈ పాన్ ఇండియా మూవీని యూవీ క్రియేషన్స్(UV Creations) సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు దసరా పండుగా సందర్బంగా అక్టోబర్ 24న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read :- థ్రిల్ చేసేలా బాగుంది
అయితే తాజాగా ఈ ప్రాజెక్టు నుండి ఒక క్రేజీ న్యూస్ ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో దగ్గుబాటి రానా విలన్ గా కనిపించనున్నాడట. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమాలో రానా పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. రానా ఇప్పటికే బాహుబలి వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో విలన్ గా అలరించాడు. ఇప్పుడు చిరంజీవితో విలన్ చేస్తున్నాడట వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. మెగా 156పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడగా.. రానా రాకతో ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. మరి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా. ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.