బాలీవుడ్‌లో ప్రస్తుతం 'రామాయణం' సినిమా చుట్టూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఓవైపు రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్‌ను చూడాలని అభిమానులు ఎదురుచూస్తుంటే.. మరోవైపు కోల్‌కతాలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆయన నోరు జారిన ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం మధ్య రణ్‌బీర్ భార్య, స్టార్ హీరోయిన్ అలియా భట్ పేరు కూడా తెరపైకి రావడం ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది.
అసలేం జరిగింది?
దసరా పండుగ సందర్భంగా చెడుపై మంచి సాధించే విజయాన్ని వివరిస్తూ రణ్‌బీర్ మాట్లాడారు. అయితే, సత్యం, మంచితనం చివరికి గెలుస్తాయనే సందేశాన్ని చెప్పే క్రమంలో చెడు ఎంత శక్తివంతమైనదైనా చివరికి నిజాయితీ, మంచి అంతమవుతాయని పొరపాటున నోరుజారి వ్యాఖ్యానించారు. తడబడుతూ చెప్పిన ఆ మాటల వీడియో వైరల్ అయింది. రాముడి పాత్ర పోషిస్తున్న నటుడు ఇలాంటి సందర్భంలో జాగ్రత్తగా మాట్లాడాల్సిందని కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరికొందరు మాత్రం మాట తడబడటాన్ని పెద్ద వివాదంగా మార్చడం సరికాదని అభిప్రాయపడ్డారు.
అలియా ఒక్క లైక్‌తోనే సీన్ మారిందా?
వివాదం కొనసాగుతున్న సమయంలో రణ్‌బీర్‌కు మద్దతుగా ఓ ఫ్యాన్ పేజీ షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని అలియా లైక్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ పోస్టులో రణ్‌బీర్‌పై విమర్శలు చేసే ముందు ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు సమాచారం.
అంతేకాదు, కోల్‌కతా కార్యక్రమానికి ముందు ఆయనకు ముప్పు ఉండొచ్చనే ప్రచారాన్ని కూడా ఆ స్టోరీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముంబైలో నటుడు టైగర్ ష్రాఫ్‌కు సంబంధించిన కాల్పుల ఘటన నేపథ్యంలో ఇతర ప్రముఖులు కూడా లక్ష్యంగా ఉండే అవకాశాలపై దర్యాప్తు జరుగుతోందనే వాదనలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అలియా నిజంగానే ఆ స్టోరీని లైక్ చేశారన్న విషయాన్ని పూర్తిగా తెలియాల్సి ఉంది.
🚨 ALIA BHATT JUST VIEWED THIS STORY 👀 Ranbir Kapoor reportedly attended the Kolkata event despite an assassination threat and a moment of hesitation during his speech turned into online trolling that eventually led to an apology. HE WAS THERE STANDING ON AN OPEN STAGE DESPITE THE SECURITY CONCERNS. Could anyone blame him for stumbling over a word under such circumstances? Criticism is one thing but all should keep Empathy. #RanbirKapoor #AliaBhatt #Ramayana
— Pan India Review (@PanIndiaReview) October 22, 2026
చెన్నై వేదికగా క్షమాపణలు..
వివాదానికి చెక్ పెట్టేందుకు రణ్‌బీర్ చెన్నైలో జరిగిన 'రామాయణం' కార్యక్రమంలో బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. తాను చెప్పాలనుకున్నది వేరని, అది కేవలం మాట తడబాటు మాత్రమేనని స్పష్టం చేశారు. అంతేకాదు, తన 'రాక్‌స్టార్' సినిమాలోని పాటను గుర్తుచేస్తూ.. మాటలు కొన్నిసార్లు తన భావాలను సరిగ్గా వ్యక్తపరచలేకపోతాయని చమత్కరించారు. దీంతో కొందరు ఆయన వివరణను స్వాగతించగా, మరికొందరు విమర్శలు కొనసాగించారు
ALSO READ : 'రామాయణం'OTTలో చూడాలంటే అదనంగా డబ్బులు కట్టాల్సిందేనా? జియోహాట్‌స్టార్ బిగ్ షాక్!
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో రణ్‌బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. ‘రామాయణ: పార్ట్ 1’ నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది..
