Rashmika Mandanna: అందుకే యానిమల్ సక్సెస్లో కనిపించలేదు.. రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika Mandanna: అందుకే యానిమల్ సక్సెస్లో కనిపించలేదు.. రష్మిక కామెంట్స్ వైరల్

యానిమల్(Animal) మూవీ ఎంత సంచలనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga), బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్(Ranbir Kapoor) కాంబోలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దాదాపు రూ.260 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ తరువాత రూ.900 కోట్లు కలెక్ట్ చేసిన సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఫాదర్ సెంటిమెంట్ అండ్ వైలెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా  నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటించిన విషయం తెలిసిందే. గీతాంజలి పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. నెటిజన్స్ నుండి కూడా మంచి కామెంట్స్ అందుకున్నారు రష్మిక. అయితే యానిమల్ మూవీ అంత భారీ విజయం సాధించినప్పటికీ ఆ సక్సెస్ లో మాత్రం రష్మిక పెద్దగా కనిపించలేదు. యానిమల్ సినిమా గురించి కూడా ఎక్కడ మాట్లాడలేదు. దీంతో ఆమె అభిమానులు ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె ముందు ఉంచారు. 

తాజాగా ఈ విషయంపై స్పందించారు రష్మిక.. యానిమల్ సూపర్ సక్సెస్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే యానిమల్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో నేను పెద్దగా కనిపించలేదని వార్తలు వినిపించాయి. కారణం.. నా తదుపరి సినిమాల షడ్యూల్స్ వెంటవెంటనే ఉండటంతో వాటికి సమయం కేటాయించాల్సి వచ్చింది. అందుకే యానిమల్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో కనిపించలేదు. ఆ కారణంగా మీరు నన్ను మిస్ అవుతున్నారని నాకు తెలుసు. నా తరువాతి సినిమాల విషయంలో అలా జరుగకుండా చూసుకుంటాను. ఆ క్షణాల కోసం ఎదురుచూస్తూ ఉంటాను.. అంటూ నోట్ రాసుకొచ్చారు రష్మిక. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప2లో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Also Read :విజయ్ కొత్త షెడ్యూల్.. మార్చి నుంచి మొదలు