
పాన్ ఇండియా భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది రష్మిక మందన్న. ఇందులో భాగంగా నేడు (జూన్27న) తన కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ‘మైసా’ (Mysaa) అనే ఆసక్తికర టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో రష్మిక మునుపెన్నడూ కనిపించని సరికొత్త పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఈ సందర్బంగా 'ఎప్పుడూ అడుగుపెట్టని ప్రపంచం ఇది.. ఇప్పటివరకు కలవని తన వెర్షన్' అని మేకర్స్ ప్రకటించారు.
ఈ కొత్త పోస్టర్లో‘‘ధైర్యం ఆమె బలం. సంకల్పంలో లేదు కనికరం.. ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి’’..! అంటూ నిర్మాణసంస్థ అన్‌ఫార్ములా ఫిల్మ్స్ శక్తివంతమైన క్యాప్షన్ ఇచ్చింది. ఈ టైటిల్ పోస్టర్ లో రష్మిక భయంకరమైన యోధురాలు అవతారంలో కనిపించి ఇంటెన్స్ పెంచుతోంది. ఈ క్రమంలోనే రష్మిక ‘మైసా’ సినిమా వివరాలు పంచుకుంది.
— Rashmika Mandanna (@iamRashmika) June 27, 2025
'నేను ఎల్లప్పుడూ మీకు కొత్తది, భిన్నమైనది, ఉత్తేజకరమైనది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇది అలాంటి వాటిలో ఒకటి.. " అని మందన్న పోస్టర్‌ను షేర్ చేసింది. రవీంద్ర పూలే డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కుతోంది.
రష్మిక మందన్న గత నాలుగేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంటుంది. యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర సినిమాలతో మంచి సక్సెస్ జోష్లో ఉంది. తెలుగులోనే కాదు ఇండియాలోనే ఏ హీరోయిన్కు సాధ్యం కాని రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం రష్మిక చేతిలో 'ది గర్ల్‌ఫ్రెండ్', 'రెయిన్‌బో' మరియు 'పుష్ప 3' మూవీస్ తో పాటుగా మరిన్ని లైన్లో ఉన్నాయి.
Can you guess what the title of my next could be? 😉
— Rashmika Mandanna (@iamRashmika) June 26, 2025
I don’t think anyone can actually guess.. but if at all you can guess it then i promise to come meet you.. 🐒😎 pic.twitter.com/7KPl6UyVJN