నేషనల్ క్రష్ రష్మికా రూట్ మార్చేసింది. బబ్లీ గాళ్ గా, ముద్దుల ప్రేయసిగా కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ .. ఇప్పుడు పూనకం వచ్చినట్లు రౌద్రరూపం దాల్చబోతోంది. రావినూతల రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'మైసా' మూవీతో రష్మిక బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడానికి సిద్ధమైంది. ఇటీవల ఓ పాట షూటింగ్ లో కాలికి గాయంతో విశ్రాంతి తీసుకుంది. ఇప్పుడు తిరిగి చిత్రీకరణలోకి పాల్గొంటోంది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
అన్ ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై అనిల్, అజయ్ సయ్యపురెడ్డి, శ్రీకాంత్ ఈ బిగ్ ప్రాజెక్ట్ 'మైసా' నిర్మిస్తున్నారు. రష్మిక మళ్లీ షూటింగ్ కు రెడీ కావడంతో.. నవంబర్ 27, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో థియేటర్లలో రష్మిక రచ్చ ఖాయం అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.
ఈ సినిమాలో రష్మిక గొండ్ గిరిజన ప్రాంతానికి చెందిన ఒక తిరుగుబాటుదారురాలిగా కనిపించనుంది. చేతిలో వేటకొడవలి పట్టుకుని విరుచుకుపడే 'మైసా' పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతేకాదు, భారతీయ చలనచిత్ర చరిత్రలోనే తొలిసారిగా ఒక కథానాయికపై చిత్రీకరించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన 'అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్' ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రష్మిక కుడి తుంటి భాగానికి గాయమైంది. నా శరీరం మిషన్ కాదు.. మనిషి శరీరం అని గుర్తించుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అంతే స్పీడ్ తో షూటింగ్ లోకి మళ్లీ అడుగుపెట్టింది రష్మిక. ఈ మూవీలో రావు రమేష్, ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, తారక్ పొన్నప్ప వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బెజోయ్ మాస్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ALSO READ : ఫోక్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి - మాధురి రాథోడ్ వివాదంలో ట్విస్ట్..
అయితే ఈసారి రష్మికకు ప్రత్యేక స్పెషల్. విజయ్ దేవరకొండ సరసన నటించిన 'రణబాలి' మూవీ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన కేవలం 42 రోజుల వ్యవధిలోనే నవంబర్ 27న 'మైసా''తో మరోసారి థియేటర్లను ఊపేయనుంది. ఒకవైపు 'ది గర్ల్‌ఫ్రెండ్' మూవీలో అమాయకమైన అమ్మాయిగా, మరోవైపు 'మైసా'లో ఊరమాస్ తిరుగుబాటుదారురాలిగా కనిపించనున్న రష్మిక దెబ్బకి బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయంగా అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
MYSAA!
— Rashmika Mandanna (@iamRashmika) September 1, 2026
The rage! The pain! The heartache! The grief! The grit! The courage! The power and the storm you don’t anticipate coming - That’s Mysaa! 🔥
In cinemas worldwide on 27.11.26!❤️@RawindraPulle @jakes_bejoy @unformulafilms @TSeries @tseriessouth pic.twitter.com/aaDqspvHE7
