Eagle OTT: ఒకరోజు ముందే OTTకి వచ్చేస్తున్న ఈగల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Eagle OTT: ఒకరోజు ముందే OTTకి వచ్చేస్తున్న ఈగల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మాస్ మహారాజ రవితేజ(Raviteja) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle). దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని(Karthik Gattamaneni) తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. పాన్ ఇండియా లెవల్లో స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాగా.. మొదటి షో నుండే డివైడ్ టాక్ ను తెచ్చుకుంది. 

అయినప్పటికి.. మంచి వసూళ్లను రాబట్టింది ఈగల్ మూవీ. మిక్సుడ్ టాక్ తో కూడా రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టి ఓ నిర్మాతలకు భారీ నష్టాలు రాకుండా బయటపెడేసింది. ఇక  సినిమాలో రవితేజ నటనకు కూడా మంచి కామెంట్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రాం ముగించుకోవడంతో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈగల్ మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను ముందుగా మార్చ్ 2న ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ, తాజా సమాచారం ప్రకారం అనుకున్న రోజు కంటే ఒకరోజు ముందే అంటే మార్చ్ 1న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. మాస్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరేకేక్కిస్తున్న ఈ సినిమాను కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.