MrBachan: ఇప్పుడే మొదలైంది..బచ్చన్ సర్ ముఖంపై క్లాప్

MrBachan: ఇప్పుడే మొదలైంది..బచ్చన్ సర్ ముఖంపై క్లాప్

మాస్ మహరాజా రవితేజ (Raviteja) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు ఒకే చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈగల్(Eagle) సినిమా చేస్తున్న రవితేజ..ఇప్పుడు మరో సినిమాను మొదలుపెట్టేశాడు. అది కూడా మిరపకాయ్ లాంటో బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ (Harish Shankar) తో వస్తుండటంతో మాస్ ఫ్యాన్స్లో భారీ అంచనాలున్నాయి. రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్‌ అమితాబ్‌ పేరు కలిసేలా..మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు.
  
ఇవాళ డిసెంబర్ 28న ఈ సినిమా షూటింగ్ షురూ అయినట్లు డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) ఫోటో పోస్ట్ చేశాడు.ఇందులో రవితేజ ముఖంపై క్లాప్ బోర్డును చూపిస్తూ..ఇది ఇప్పుడే మొదలైంది అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్లో రవితేజ అచ్చం నేనింతే సినిమా స్టైల్లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.

Also read : విజయకాంత్ మరణవార్త తట్టుకోలేక..వెక్కి వెక్కి ఏడ్చిన విశాల్

ఇదిలా ఉంటే..హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్గా చాలా బిజీగా ఉన్నారు. ఆ కారణంగా ఆయన చేస్తున్న సినిమాల షూటింగ్స్ అన్నీ వాయిదా పడ్డాయి. అందులో  ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. దాంతో రవితేజ తో కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు హరీష్ శంకర్.