IPL 2026 vs Cockroach Janta Party: ప్రస్తుతం దేశమంతా ఐపీఎల్ (IPL 2026) ఫీవర్‌తో ఊగిపోతోంది. మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంటే.. సోషల్ మీడియాలో మాత్రం ఊహించని ఒక 'డిజిటల్ విప్లవం' ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది. కేవలం ఒక సెటైరికల్ (Satirical) ఉద్యమంగా మే మధ్యలో మొదలైన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP).. కేవలం 5 రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్లకు (1.4 కోట్లు) పైగా ఫాలోవర్లను సంపాదించి చరిత్ర సృష్టించింది. ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ, సీఎస్‌కే లాంటి దిగ్గజ క్రికెట్ ఫ్రాంచైజీల డిజిటల్ పాపులారిటీకి ఈ సీజేపీ పార్టీ గట్టి పోటీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
జెన్-జీ (Gen Z) సపోర్ట్:
ఈ వైరల్ ట్రెండ్ వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఇటీవలే దేశంలో నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన ఒక వివాదాస్పద వ్యాఖ్యకు నిరసనగా ఈ వర్చువల్ పొలిటికల్ పార్టీ పుట్టుకొచ్చింది. నిరుద్యోగులు, సోషల్ మీడియా బ్యాచీల కోసం "వాయిస్ ఆఫ్ ది లేజీ అండ్ అన్‌ఎంప్లాయిడ్" అనే ట్యాగ్‌లైన్‌తో నెటిజన్లు దీనిని సృష్టించారు.
►ALSO READ | బ్లాక్ మార్కెట్‌లో SRH vs RCB మ్యాచ్ టికెట్లు.. నిమిషాల్లో 39 వేల టికెట్లు మాయం.. ఆందోళనలో ఫ్యాన్స్
ఆర్‌సీబీ, సీఎస్‌కేల రికార్డులు బ్రేక్:
ఐపీఎల్ సీజన్ కావడంతో ఇంటర్నెట్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న తరుణాన్ని ఉపయోగించుకుని, మీమ్ మార్కెటింగ్ (Meme Marketing) తో యువతను ఆకట్టుకున్నారు. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లప్పుడు కొట్టుకునే క్రికెట్ ఫ్యాన్స్ అందరూ తమ ఫ్యాన్ వార్స్ పక్కన పెట్టి ఈ డిజిటల్ జోక్‌లో భాగస్వాములయ్యారు. ఫాంటసీ క్రికెట్ ప్రెడిక్షన్స్, మీమ్స్ చేస్తూ ఎప్పుడూ ఆన్‌లైన్‌లో ఉండే యువతకు, నిరుద్యోగ సమస్యను ప్రతిబింబించిన ఈ పార్టీ మేనిఫెస్టో బాగా కనెక్ట్ అయింది. ఈ స్పీడ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆర్‌సీబీ, సీఎస్‌కేల రికార్డులను కూడా ఈ 'కాక్రోచ్ పార్టీ' బద్దలు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
IPL ఫ్రాంచైజీలతో 'కాక్రోచ్ పార్టీ' ఫాలోవర్ల పోలిక:
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): 24 మిలియన్లు (16 ఏళ్లు)
* చెన్నై సూపర్ కింగ్స్ (CSK): 23 మిలియన్లు (16 సంవత్సరాలు)
* ముంబై ఇండియన్స్ (MI): 20 మిలియన్లు (16 సంవత్సరాలు)
* కాక్రోచ్ జనతా పార్టీ (CJP): 14 మిలియన్లు (కేవలం 5 రోజులు!)
* సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): 5 మిలియన్లు (12 సంవత్సరాలు)
