బ్లాక్ మార్కెట్‌లో SRH vs RCB మ్యాచ్ టికెట్లు.. నిమిషాల్లో 39 వేల టికెట్లు మాయం.. ఆందోళనలో ఫ్యాన్స్

 బ్లాక్ మార్కెట్‌లో SRH vs RCB మ్యాచ్ టికెట్లు.. నిమిషాల్లో 39 వేల టికెట్లు మాయం.. ఆందోళనలో ఫ్యాన్స్

2026 ఐపీఎల్ సీజన్ ఆల్మోస్ట్ నాకౌట్ దశ నుంచి ప్లే ఆఫ్ స్టేజ్ కి చేరుకుంది. మే 22న (శుక్రవారం) ఉప్పల్లో హైదరాబాద్ వర్సెస్ బెంగళూర్ మ్యాచ్ జరగునుంది. SRH తో పాటు RCB కి చివరి లీగ్ మ్యాచ్ కావడంతో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో టికెట్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

ఉప్పల్‌లో జరగబోయే RCB వర్సెస్‌ SRH మ్యాచ్ కు సంబంధించి నిమిషాల్లో 39 వేల టికెట్లు మాయం అవుతున్నట్లు ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బ్లాక్ టికెట్లపై పోలీసుల స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్లాక్‌ టికెట్లు అమ్మేవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

ప్రతి మ్యాచ్ కి అడిషనల్ టికెట్స్ కు ఒక రోజు ముందు బుకింగ్ అవకాశం ఇస్తారు. అయితే ఈ మ్యాచ్ కి అడిషినల్ టికెట్స్ బుకింగ్  కి అవకాశం ఇవ్వలేదని ఫ్యాన్స్ అంటున్నారు. SRH ఫ్రాంచైజ్ కూడా  గత మ్యాచ్ ల కంటే ఎక్కువ రేట్లకు టికెట్స్ అమ్మకాలు జరుపుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

►ALSO READ | 2027 వన్డే వరల్డ్కప్‌ కోహ్లీ, రోహిత్ ఆడేది డౌటే?.. సీనియార్టీ కాదు.. ఫామ్ ఉంటేనే ఛాన్స్!

ఒకవైపు ఫ్రాంచైజ్ ధరలు పెంచడం.. మరోవైపు బ్లాక్ టికెట్స్ తో స్టేడియానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరి మ్యాచ్ కావడం.. స్టార్ క్రికెటర్ విరాట్ రావడం ఇందుకు కారణం అని అభిమానులు చెబుతున్నారు.