Kohli– Rohit: భారత క్రికెట్‌లో సంచలన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. టీమిండియా లెజెండ్స్ రోహిత్ శర్మ (Rohit Sharma), రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ల వన్డే కెరీర్‌పై సెలెక్షన్ కమిటీ ఒక కీలక సంకేతాన్ని పంపింది. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ (2027 ODI World Cup) రేసులో ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు 'ఆటోమేటిక్ ఛాయిస్' (ఖచ్చితంగా జట్టులో ఉంటారు అని చెప్పలేం) కాదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
అగార్కర్ మార్క్ ప్లాన్:
ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం రోహిత్, విరాట్‌లకు విశ్రాంతి ఇవ్వాలనే అంశంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నేతృత్వంలోని సెలెక్షన్ ప్యానెల్ సుదీర్ఘంగా చర్చించింది. కానీ, రాబోయే మెగా టోర్నీలకు జట్టును సిద్ధం చేసే క్రమంలో సీనియర్ల ఫామ్, ఫిట్‌నెస్ నిరంతరం మానిటర్ చేయడం అత్యవసరమని సెలెక్టర్లు భావించారు. 2027 వరల్డ్ కప్‌కు ఇంకా చాలా టైం ఉంది.. అందుకే జట్టులో ఎవరికీ శాశ్వత స్థానం ఉండదు.. రోహిత్, కోహ్లీలైనా సరే.. భవిష్యత్తులో వారు చూపించే ప్రదర్శన ఆధారంగానే జట్టులో చోటు దక్కుతుంది.. కేవలం సీనియార్టీని చూసి ఎవరికీ సీటు కేటాయించకూడదని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది.
యువ ఆటగాళ్లకు అగ్నిపరీక్ష:
భారత వన్డే జట్టు ప్రస్తుతం ఒక కీలక మార్పు దిశగా అడుగులు వేస్తోంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో యువ రక్తాన్ని జట్టులోకి తెస్తూనే.. విరాట్, రోహిత్ లాంటి స్టాల్‌వర్ట్స్ చుట్టూ యంగ్ ప్లేయర్స్ ఎదిగేలా మేనేజ్‌మెంట్ ప్లాన్ చేస్తోంది. రాబోయే సిరీస్‌లు యంగ్ ప్లేయర్స్ కు మాత్రమే కాదు, వారి ఫామ్‌ను నిరూపించుకోవడానికి ఈ ఇద్దరు సీనియర్లకు కూడా చాలా కీలకం కానుంది.
►ALSO READ | అనిరుధ్‌తో SRH ఓనర్ కావ్య మారన్ సీక్రెట్ పెళ్లి? నెట్టింట జోరుగా ప్రచారం
ఎలాంటి ఒత్తిడిలోనైనా విలువనిచ్చే చోటే తాను ఉంటానని, ప్రతిసారీ తన వాల్యూని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఇటీవల విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఈ సెలెక్షన్ కమిటీ నిర్ణయాల నేపథ్యంలో మరింత హాట్ టాపిక్‌గా మారాయి. మరి సెలెక్టర్ల ఈ కొత్త నిబంధనను దాటుకుని రోహిత్, కోహ్లీలు 2027 వరల్డ్ కప్ బరిలోకి దిగుతారో లేదో వేచి చూడాలి.
ఆఫ్ఘనిస్తాన్ తో ఆడే భారత వన్డే జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ (ఫిట్నెస్ ఆధారంగా ఎంపిక), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా(ఫిట్నెస్ ఆధారంగా ఎంపిక), నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.
