RCB New Captain: ఐపీఎల్ (IPL 2026) హిస్టరీలోనే బ్యాక్-టు-బ్యాక్ రెండు టైటిల్స్ అందించి.. ఆర్సీబీ ఫ్యాన్స్ దశాబ్దాల కలను నిజం చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్. కానీ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఒక మైండ్ బ్లోయింగ్ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. వరుసగా రెండు కప్పులు అందించిన పాటిదార్ స్థానంలో.. రాబోయే రోజుల్లో పక్కా బెంగళూరు అబ్బాయి దేవదత్ పడిక్కల్ చేతికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ పగ్గాలను అప్పగించాలని మేనేజ్‌మెంట్ ప్లాన్ చేస్తోంది.
ఐపీఎల్లో పడిక్కల్ ఊచకోత.. మేనేజ్‌మెంట్ ఫిదా:
ఈ సీజన్‌లో నంబర్ 3 పొజిషన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన దేవదత్ పడిక్కల్ ప్రత్యర్థి బౌలర్లకు నరకం చూపించాడు. కొన్ని సీజన్లుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డ ఈ లెఫ్ట్ హ్యాండర్.. తన సొంత గూటికి (ఆర్సీబీ) రాగానే విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే 168.72 మైండ్ బ్లాయింగ్ స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 464 రన్స్ సాధించాడు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఇచ్చే మెరుపు ఆరంభాన్ని వన్-డౌన్‌లో వచ్చి కూడా అదే ఇంటెన్సిటీతో పడిక్కల్ కంటిన్యూ చేశాడని ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ కొనియాడారు. జట్టు కోసం స్వార్థం లేకుండా (Selflessly) ఆడిన పడిక్కల్‌లో పర్ఫెక్ట్ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, అతను ఫ్యూచర్ కెప్టెన్ అని బోబాట్ హింట్ ఇచ్చారు.
పాటిదార్ స్థానంలో పడిక్కల్ ఎందుకు?:
రజత్ పాటిదార్ కెప్టెన్‌గా తిరుగులేని సక్సెస్ సాధించినప్పటికీ.. పాటిదార్ కంటే పడిక్కల్ వయసులో ఏకంగా 8 ఏళ్లు చిన్నవాడు.. ప్రస్తుతం కేవలం 25 ఏళ్ల వయసున్న పడిక్కల్ ఇంకా తన కెరీర్ పీక్ స్టేజ్‌కు చేరుకోవాల్సి ఉంది. లాంగ్ రన్ ప్లాన్స్‌లో భాగంగా ఆర్సీబీని సుదీర్ఘకాలం లీడ్ చేయగల సమర్థుడు పడిక్కల్ మాత్రమేనని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఆర్సీబీ మెంటర్, బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ సైతం పడిక్కల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ టీమ్‌లో బెంగళూరు లోకల్ బాయ్ అనే ఫీలింగ్‌ను 100 శాతం ఓన్ చేసుకున్న ఏకైక ప్లేయర్ పడిక్కల్.. అతను పక్కా బెంగళూరు మ్యాన్.. గేమ్ సిట్యుయేషన్స్‌ను చాలా త్వరగా అర్థం చేసుకునే మెచ్యూరిటీ అతనికుంది.
►ALSO READ | టీమిండియా ఫ్యాన్స్ అలర్ట్: భారత్ vs ఐర్లాండ్ సిరీస్ టైమింగ్ చేంజ్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే!
ఆర్సీబీని లీడ్ చేయనున్న పడిక్కల్:
ఆర్సీబీతో ఆల్రెడీ 5 సీజన్ల అనుభవం ఉన్న ఈ లోకల్ స్టార్, భవిష్యత్తులో టీమ్‌ను లీడ్ చేయడానికి పర్ఫెక్ట్ ఛాయిస్ అని క్రికెట్ విశ్లేషకులు కూడా అంటున్నారు. మరి రెండుసార్లు ట్రోఫీలు అందించిన రజత్ పాటిదార్ స్థానంలో యంగ్ బ్లడ్ పడిక్కల్‌కు కెప్టెన్సీ ఇవ్వాలనే ఆర్సీబీ థింకింగ్ కరెక్టేనా? లోకల్ బాయ్ దేవదత్ కెప్టెన్‌గా వస్తే ఆర్సీబీ రేంజ్ ఉంటుందో మరీ.
BIG STATEMENT FROM MO BOBAT! 👀🔥
— Infinite Infos (@infiniteInfos) June 24, 2026
🗣️ "Devdutt Padikkal will be the future captain of RCB."
With Rajat Patidar currently leading the side, RCB may already be planning for the next generation. ❤️
Do you see Devdutt Padikkal captaining RCB in the future? 🤔👇#DevduttPadikkal… pic.twitter.com/1Z8EG41yJX
