ఫియర్ మూవీ షూట్ కంప్లీట్

ఫియర్ మూవీ షూట్ కంప్లీట్

వేదిక హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ఫియర్‌‌‌‌‌‌‌‌’. అరవింద్ కృష్ణ స్పెషల్ రోల్‌‌‌‌లో కనిపించనున్నాడు.  హరిత గోగినేని దర్శకత్వంలో ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. ఇటీవల మొదలైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌‌‌‌ను సింగిల్ షెడ్యూల్‌‌‌‌లో పూర్తి చేశారు.

నటీనటులు, టీమ్ సపోర్ట్‌‌‌‌తోనే తక్కువ టైమ్‌‌‌‌లో షూట్‌‌‌‌ను కంప్లీట్ చేయగలిగామని హరిత చెప్పారు. అవుట్‌‌‌‌పుట్ బాగా వచ్చిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టామన్నారు.  త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌‌‌‌ కూడా అనౌన్స్ చేస్తామన్నారు.  జయప్రకాష్, పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్లా, సాయాజీ షిండే ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.