పవన్ కళ్యాణ్ - దేవా కట్టా క్రేజీ కాంబో.. వైరల్ అవుతున్న వార్తలపై డైరెక్టర్ రియాక్షన్ ఇదే!

పవన్ కళ్యాణ్ - దేవా కట్టా క్రేజీ కాంబో.. వైరల్ అవుతున్న వార్తలపై డైరెక్టర్ రియాక్షన్ ఇదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఉగాది ( మార్చి 19, 2026 ) కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంది. బాక్సాఫీస్  ఇప్పటివరకు  రూ. 85 కోట్లు మాత్రమే వసూళ్లు రాబట్టింది. కేవలం ఫ్యాన్ సర్వీస్ సినిమాగానే మిగిలిపోయింది అన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే దేవా కట్టాతో పవన్ సినిమా చేయబోతున్నారనే ప్రచారం మొదలైంది. నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

దేవా కట్టా ఏమన్నారంటే?

ఈ పుకార్లపై దర్శకుడు దేవా కట్టా స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలు ఎలా మొదలయ్యాయో నాకు తెలియదు, కానీ ఇందులో వాస్తవం లేదు అని కొట్టిపారేశారు. అయితే, పవన్ కళ్యాణ్‌తో పనిచేయడం తన చిరకాల వాంఛ అని ఆయన మనసులో మాట బయటపెట్టారు. నిజానికి నేను తీసిన 'రిపబ్లిక్' సినిమా స్క్రిప్ట్‌ను మొదట పవన్ కళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నాను. ఆయనతో పనిచేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. భవిష్యత్తులో మంచి ఐడియా కుదిరితే తప్పకుండా మా కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది అని దేవా కట్టా పేర్కొన్నారు.  ప్రస్తుతం తాను ఒక పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ లేని కథపై పని చేస్తున్నానని, త్వరలోనే తన తదుపరి ప్రాజెక్ట్ వివరాలను వెల్లడిస్తానని ఆయన తెలిపారు.

అభిమానుల నిరాశ..

పవన్ కళ్యాణ్ పొలిటికల్ థ్రిల్లర్లు చేస్తే చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. గతంలో 'ప్రస్థానం', 'రిపబ్లిక్' వంటి పవర్‌ఫుల్ సినిమాలు తీసిన దేవా కట్టా, పవన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక సామాజిక అంశంతో కూడిన సినిమా తీస్తే అది రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ప్రస్తుతానికి ఈ కాంబో లేదని తేలిపోవడంతో ఫ్యాన్స్ కొంచెం నిరాశకు గురయ్యారు. 

ALSO READ : ధనుష్–మమితా కాంబోలో థ్రిల్లర్.. ‘కారా’లో సెల్లీగా షాకింగ్ రోల్!

పవన్ టీమ్ క్లారిటీ..

అటు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్న ఈ వార్తలపై పవన్ కళ్యాణ్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం పవన్ కేవలం 'OG 2' (ఓజీ 2) ప్రాజెక్ట్ మీద మాత్రమే దృష్టి సారించారని, ప్రస్తుతం వేరే కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయలేదని వారు స్పష్టం చేశారు.  పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కెరీర్,  సినిమా షూటింగ్‌ల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని క్లారిటీ ఇచ్చారు. దేవా కట్టా, పవన్ కళ్యాణ్ మధ్య ప్రస్తుతానికి ఎలాంటి ప్రాజెక్ట్ ఖరారు కాలేదు. కానీ, భవిష్యత్తులో వీరిద్దరి నుంచి ఒక 'మాస్టర్ పీస్' వచ్చే అవకాశం ఉందని దేవా కట్టా మాటలను బట్టి అర్థమవుతోంది.