Mamitha Kara: ధనుష్–మమితా కాంబోలో థ్రిల్లర్.. ‘కారా’లో సెల్లీగా షాకింగ్ రోల్!

Mamitha Kara: ధనుష్–మమితా కాంబోలో థ్రిల్లర్.. ‘కారా’లో సెల్లీగా షాకింగ్ రోల్!

హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju) వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటిస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న విశ్వనాథన్ & సన్స్ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో విగ్నేష్ రాజా దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న ‘కారా’ (KARA) సినిమాలో నటిస్తోంది. ‘కారా’ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతూ, ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా ‘కారా’ నుంచి మమితా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ఆమె మేకప్ లేకుండా, సాధారణ చీరలో నేలపై కూర్చుని, కలత చెందిన భావాలతో కనిపిస్తూ, సినిమాలోని ఎమోషన్ని వ్యక్తపరుస్తుంది. ప్రేమలు, డ్యూడ్ సినిమాల్లో చలాకీగా కనిపించిన మమితా, ఈ సినిమాలో ‘సెల్లీ’ అనే ఇంటెన్స్ పాత్రలో నటిస్తోంది. ఈ పాత్రతో తనలోని మరో కోణాన్ని చూపించనుందని పోస్టర్ ద్వారా స్పష్టమవుతోంది.

అలాగే, ఈ సినిమా షూటింగ్ అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఒక ఆసక్తికర అనుభవాన్ని పంచుకుంది. . సాధారణంగా షూటింగ్ సమయంలో ఎంతో ప్రశాంతంగా, నియంత్రణతో నటించే ఆమె, ఒక టేక్‌లో మాత్రం ఏకాగ్రత కోల్పోయినట్లు తెలిపింది. మమితా మాట్లాడుతూ, “ఈ సినిమాలో ధనుష్ గారి విలక్షణమైన నటన చూసి ఆశ్చర్యపోయాను. ఆ షాట్‌లో ధనుష్ నటన ఎంతో సహజంగా, ప్రభావవంతంగా ఉండటంతో, క్షణం పాటు ఆశ్చర్యానికి గురై తన డైలాగ్స్‌ను పూర్తిగా మర్చిపోయానని ” అని వెల్లడించింది. ఈ సంఘటనను మమితా ఒక విలువైన అభ్యాస అనుభవంగా పేర్కొంటూ, ఇలాంటి సందర్భాలు నటనలో మరింత మెరుగుదలకు దోహదపడతాయని చెప్పింది.

కారా చిత్రం గురించి:

‘కారా’ మూవీ 2026 ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ రూపొందింది. ప్రారంభంలో ఈ సినిమాను D54 అనే వర్కింగ్ టైటిల్‌తో పిలిచేవారు. ఆ తర్వాత 2026 పొంగల్ సందర్భంగా అధికారికంగా కారా అనే టైటిల్‌ను ప్రకటించారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ భాగంగా కథలోని ప్రధాన పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ ఆసక్తి పెంచుతున్నారు.

►ALSO READ | Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. మిస్సింగ్ బాలికలపై ఉత్కంఠరేపే ఇన్వెస్టిగేషన్

ఇందులో భాగంగా ధనుష్ తర్వాత హీరోయిన్ మమితా బైజు పాత్రను రివీల్ చేశారు. ఈ చిత్రానికి దర్శకుడు విగ్నేష్ రాజా, విజయవంతమైన థ్రిల్లర్ ‘పోర్ తోజిల్’  టీమ్‌కు చెందిన ఆల్ఫ్రెడ్ ప్రకాష్ తో కలిసి కథను రచించారు. దీంతో కథపై అంచనాలు పెరిగాయి. అలాగే, తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో Netflix లోగో కనిపించడం గమనార్హం. అంటే, థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కోసం నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది.