Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. మిస్సింగ్ బాలికలపై ఉత్కంఠరేపే ఇన్వెస్టిగేషన్

Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. మిస్సింగ్ బాలికలపై ఉత్కంఠరేపే ఇన్వెస్టిగేషన్

బాలీవుడ్ సీనియర్ నటి రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ ‘మర్దానీ 3’ (Mardaani 3) . అభిరాజ్ మినవాల దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 30న విడుదలైన ఈ చిత్రం ‘మర్దానీ’ ఫ్రాంచైజీలో మూడో భాగంగా తెరకెక్కింది. మహిళల అక్రమ రవాణా, కిడ్నాప్ వంటి అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ హిట్ అయింది.

ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.75 కోట్ల గ్రాస్, ఇండియాలో రూ.60 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఈ హై-వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. మార్చి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే, చిత్ర నిర్మాతల నుండి గానీ లేదా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నుండి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. 

ఇందులో డ్యూటీలో రాజీ ప‌‌డ‌‌కుండా ధైర్య సాహ‌‌సాల‌‌ను ప్రద‌‌ర్శించే ప‌‌వ‌‌ర్‌‌ఫుల్ పోలీస్ ఆఫీస‌‌ర్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణీ ముఖర్జీ ఇంప్రెస్ చేశారు. దేశంలో మిస్ అవుతున్న 93 మంది బాలిక‌‌ల‌‌ను కాపాడేందుకు ఆమె చేసే పోరాట‌‌మే ఈ సినిమా క‌‌థాంశం. రాణీ ముఖర్జీని ఎదిరించే విల‌‌న్ రోల్‌‌లో న‌‌టి మ‌‌ల్లికా ప్రసాద్ కనిపించారు.‘సైతాన్’ ఫేమ్ జాన‌‌కి బొడివాలా ‘కానిస్టేబుల్ ఫాతిమా అన్వర్’ అనే కీల‌‌క పాత్ర పోషించింది. 

‘మర్దానీ’ ఫస్ట్ పార్ట్: ప్రధానంగా ఒక కిడ్నాప్ కేసు చుట్టూ తిరుగుతుంది. చైల్డ్ ట్రాఫికింగ్ మరియు డ్రగ్స్ మాఫియా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి 'కరణ్' (తాహిర్ రాజ్ భాసిన్) ను పట్టుకోవడానికి, అతని నేర సామ్రాజ్యాన్ని ఛేదించడానికి చేసే శివానీ చేసే పోరాటమే ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమా స్త్రీ శక్తిని, మహిళలపై జరిగే నేరాలకు వ్యతిరేకంగా పోలీసుల పోరాటాన్ని అద్భుతంగా చూపించింది

ALSO READ : మెగాస్టార్ మాస్ జాతర రెడీ.. 

‘మర్దానీ’ సెకండ్ పార్ట్: కోటాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శివాని, అక్కడ యువతులను లక్ష్యంగా చేసుకుని, అత్యాచారం చేసి, అతి కిరాతకంగా చంపే ఒక సీరియల్ కిల్లర్‌(విశాల్ జేత్వా)ను పట్టుకునే బాధ్యతను తీసుకుంటుంది. అతన్ని పట్టుకోవడానికి ఆమె రాజస్థాన్‌లోని కోటాలో చేసే పోరాటాన్ని చూపిస్తుంది. సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, యువతలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తిపై ‘మర్దానీ2’ తీవ్రంగా ప్రశ్నిస్తుంది. 

 ‘మర్దానీ 3’ కథ విషయానికి వస్తే..

‘మర్దానీ 3’ వరకు వచ్చేసరికి కేసు పెద్ద మలుపు తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా వ్యాపించిన మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్ బయటపడుతుంది. ముఖ్యంగా యుక్తవయస్సు రాని (మెచ్యూర్ కాని) బాలికలను టార్గెట్ చేసే క్రిమినల్ సిండికేట్పై వచ్చింది. దీని వెనుక ఉన్న లోతైన కుట్ర, ఆర్గనైజ్డ్ క్రైమ్, మరియు హయ్యర్-లెవల్ ఇన్‌వాల్వ్‌మెంట్తో కథ ఆసక్తిగా రన్ అవుతుంది.

ముఖ్యంగా ఢిల్లీలో ఓ రాయబారి కుమార్తె మిస్ అవుతుంది. హై ప్రొఫైల్ కేసు కనుక శివానీ శివాజీ రాయ్ (రాణీ ముఖర్జీ)కి అప్పగిస్తారు. దర్యాప్తులో ఒక్క రాయబారి కుమార్తె మాత్రమే కాదని.. ఢిల్లీలో సామాన్యుల కుమార్తెలు చాలా మంది మిస్ అయ్యారని తెలుస్తుంది.

ఈ దర్యాప్తులో ఆమెకు ఒక భయంకరమైన బిచ్చగాళ్ల మాఫియా, అలాగే ఒక ప్రాణాంతకమైన మెడికల్ ఎక్స్‌పెరిమెంట్ గుట్టు తెలుస్తుంది. హెచ్‌పీవీ వైరస్‌ను మార్చి ఆ కిడ్నాప్ అయిన పిల్లల మీద చట్టవిరుద్ధంగా మందులు ప్రయోగిస్తున్నారన్న విషయం బయటపడుతుంది. 

ఇదే క్రమంలో ఆ కిడ్నాప్స్ వెనుక అమ్మ (మల్లికా ప్రసాద్) ఉందని శివానీ రాయ్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. అయితే, అది కూడా మెచ్యూర్ కాని అమ్మాయిలను మాత్రమే సెలెక్ట్ చేసి కిడ్నాప్ చేస్తున్నారని తెలుసుకుంటుంది?

అసలు మెచ్యూర్ కాని అమ్మాయిలనే ఎందుకు కిడ్నప్ చేస్తున్నారు? బెగ్గర్ మాఫియా లేడీ డాన్ ఈ కిడ్నాప్స్ చేయించడం వెనుక ఎవరు ఉన్నారు? ఈ కేసును శివానీ శివాజీ రాయ్ ఎలా చేధించించారు? అనేది పార్ట్ 3 కథ.