హైదరాబాది ర్యాప్తో ఇజ్జత్ సాంగ్.. సుమ కొడుకు రోషన్ డ్యాన్స్ కుమ్మేసాడుగా

హైదరాబాది ర్యాప్తో ఇజ్జత్ సాంగ్.. సుమ కొడుకు రోషన్  డ్యాన్స్ కుమ్మేసాడుగా

నటుడు రాజీవ్ కనకాల, స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ (Roshankanakala) హీరోగా 'బబుల్ గమ్'(Bubblegum) అనే సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్నాడు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నడైరెక్టర్ రవికాంత్ పెరేపు (Ravikanthperepu) తెరకెక్కిస్తున్నఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియన్స్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా ప్రమోషన్స్ అదరగొట్టేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, హబీబీ అనే సాంగ్  ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

లేటెస్ట్గా బబుల్ గమ్ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. 'ఇజ్జత్' అంటూ సాగే ఈ పాటని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇజ్జత్  ర్యాప్ సాంగ్ ఫుల్ ఎనర్జిటిక్ మోడ్ లో సాగుతూ..రోషన్ తన ఎనర్జీతో డ్యాన్స్ కుమ్మేసాడు. హైదరాబాది ర్యాప్ తరహాలో ఉన్న ఈ పాటకు MC హరి లిరిక్స్ అందించగా..మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల యూత్ కి కనెక్ట్ అయ్యేలా ట్యూన్ కంపోజ్ చేశారు. 

Also Read :- జ్యుడిషియల్, పొలిటీషియన్స్, పోలీస్లు తప్పు చేస్తే ఎవరు ప్రశ్నిస్తారు..?

 కర్లీ హెయిర్, గడ్డంతో ఉన్న ఈ యంగ్ ఎనర్జిటిక్ రోషన్కు జోడీగా మానస చౌదరి హీరోయిన్‌‌‌‌ గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే నెల డిసెంబర్ 29న థియేటర్లో రిలీజ్ కానుంది.