Dhootha Trailer : జ్యుడిషియల్, పొలిటీషియన్స్, పోలీస్లు తప్పు చేస్తే ఎవరు ప్రశ్నిస్తారు..?

Dhootha Trailer : జ్యుడిషియల్, పొలిటీషియన్స్, పోలీస్లు తప్పు చేస్తే ఎవరు ప్రశ్నిస్తారు..?

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) డిజిటల్ డెబ్యూ దూత (Dhootha) వెబ్ సిరీస్. సూపర్ నాచురల్ హారర్ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌ను విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేశాడు. దూత వెబ్ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా సాగుతూ..ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో ఉంటుందని తెలుస్తోంది. 

లేటెస్ట్గా దూత వెబ్సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇవాళ (నవంబరు 23) చైతు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఆకట్టుకుంటోంది. ఇందులో నాగచైతన్య జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇందులో మీడియాను ప్రధాన కేంద్రంగా తీసుకున్నట్టుగా అనిపిస్తోంది.

138 కోట్ల మందిని కాపాడుతున్న ఈ జ్యుడిషియల్ సిస్టమ్..పొలిటీషియన్స్..పోలీస్ లు వీళ్ళు తప్పు చేస్తే ఎవ్వరు ప్రశ్నిస్తారు? అది ఒక జర్నలిస్ట్ అంటూ చైతన్య ను రివీల్ చేసారు. అలాగే ఒక కార్టూన్లో చూపించిన విధంగానే వరస మర్డర్స్ జరగడం..ఆ నింద చైతన్య పై పడటం చూపించడం థ్రిల్లింగ్గా ఉంది.

అందులో భాగంగానే ఈ కేసు నుంచి నాగ చైతన్య ఎలా బయట పడ్డాడు. అసలు క్రైమ్స్ చేస్తున్నది ఎవరు..? వాటి వెనుక ఎవరున్నారు? ఆ నిజాలను నాగ చైతన్య ఎలా తెలుసుకున్నాడు అన్నది ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. 

మీడియా, కార్టూనిస్ట్, వరుస మరణాలు, అవి హత్యలా? ఆత్మహత్యలా? అని విచారణ ఒక వైపు..తెలియని నిందను ఛేదించడానికి హీరో పరుగులు తీయడం ఇలా ట్రైలర్‌లో ఎన్నో అంశాల మీద ఆసక్తిని కలిగించేలా చేశారు డైరెక్టర్ విక్రమ్. నాగ చైతన్య కెరీర్లో ఫస్ట్ టైం వెబ్సిరీస్లో నటిస్తున్నాడు. ఈ వెబ్సిరీస్ డిసెంబర్1న ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. 

విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ వెబ్సిరీస్ తో హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. అక్కినేని ఫ్యామిలీ డైరెక్టర్ గా పేరు పొందిన డైరెక్టర్ విక్రమ్..గత చిత్రాలు థ్యాంక్యూ,హాలో మూవీస్ యావరేజ్గా నిలిచాయి. దీంతో ఎలాగైనా నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ తో హిట్ కొట్టాలని చాలా ఇంటెన్స్వ్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 

  • Beta
Beta feature