టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీ ఉన్నారు. నేషనల్ క్రష్ రష్మికతో వివాహం తర్వాత ప్రస్తుతం షూటింగ్స్ పై దృష్టిపెట్టారు. ఈసారి గతంలో ఎన్నడూ చూడని రీతిలో పక్కా మాస్ అవతారంలో అలరించేందుకు రెడీ అవుతున్నారు. గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న స్పై థ్రిల్లర్, రాహుల్ సంకీర్త్యన్‌తో పీరియడ్ డ్రామా వంటి వైవిధ్యమైన చిత్రాల మధ్యలో.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘రౌడీ జనార్ధన’.
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో..
దిల్ రాజు నిర్మాణంలో, ‘రాజా వారు రాణి గారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఒక పవర్‌ఫుల్ రూరల్ మాస్ డ్రామాగా రూపొందుతోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ పాత్ర పేరు జనార్ధన్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సినిమాలో ఆయన తండ్రి పేరు కూడా జనార్ధనేనని ఇన్‌సైడ్ టాక్. విజయ్ బ్రాండ్ నేమ్ అయిన 'రౌడీ'ని టైటిల్‌లో చేర్చడంతో అభిమానుల్లో అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
ALSOREAD : ఇంట్రెస్టింగ్ కాంబో: సినిమా చరిత్రలో అరుదైన హిస్టరీ.. మొదటి హీరోతోనే డైరెక్టర్ 100వ సినిమా..
ముంబై స్లమ్స్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్
లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో గ్రాండ్ స్కేల్‌లో ఉండే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ముంబైలోని స్లమ్ ఏరియాలో జరిగే హై-వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలవనుందట. ఈ ఫైట్ చాలా రియలిస్టిక్‌గా, రా అండ్ రగ్గడ్ స్టైల్‌లో ఉండబోతున్నట్లు సమాచారం. హాలీవుడ్ స్థాయిలో ఇంటెన్స్ యాక్షన్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేలా చిత్ర బృందం దీనిని డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.
మాస్ మేకోవర్
ఈ పాత్ర కోసం విజయ్ దేవరకొండ తన బాడీ లాంగ్వేజ్‌ను, లుక్‌ను పూర్తిగా మార్చేస్తున్నారు. ఒక రఫ్ అండ్ టఫ్ లుక్‌లో ఆయన కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన విజయ్ మేకోవర్ ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఒక సామాన్య యువకుడు 'రౌడీ జనార్ధన'గా ఎలా మారాడు? అనే పాయింట్ చుట్టూ కథ ఆసక్తికరంగా తిరుగుతుందట. ఈసారి క్లాస్ ఆడియన్స్‌నే కాకుండా, మాస్ సెంటర్లను కూడా షేక్ చేయాలని గట్టి పట్టుదలతో విజయ్ ఉన్నారు.
దిల్ రాజు వంటి అగ్ర నిర్మాత ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, మేకింగ్ వాల్యూస్ కూడా టాప్ క్లాస్‌లో ఉండబోతున్నాయి. అటు ‘రౌడీ జనార్ధన’తో విజయ్ తన నటనా విశ్వరూపాన్ని చూపించడమే కాకుండా, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముంబై మురికివాడల నుండి రాయలసీమ పల్లెల వరకు ఈ రౌడీ జనార్ధన చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!
