ఒక్క రీల్‌కు రూ.76 లక్షలు.. 'పెయిడ్ ఫ్రెండ్ షిప్' బిజినెస్‌తో మైండ్ బ్లాక్ చేస్తున్న ఓర్రీ!

ఒక్క రీల్‌కు రూ.76 లక్షలు.. 'పెయిడ్ ఫ్రెండ్ షిప్' బిజినెస్‌తో మైండ్ బ్లాక్ చేస్తున్న ఓర్రీ!

బాలీవుడ్ స్టార్స్ తో పాటు సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తుంటారు ఓర్హాన్ అవత్రామణి. సెలబ్రిటీల పార్టీలలో విలక్షణమైన భంగిమలతో ప్రముఖులతో కలిసి ఫోటోలకు పోజులిస్తుంటారు. ముద్దుగా ఓరీ ( Orry ) అని పిలుచుకునే ఇతను వ్యాపారవేత్త కాదు, నటుడు కాదు . మరి ఇంత పాపులారిటీని సొంతం చేసుకున్న  ఇతను అసలు ఏం చేస్తుంటారు అని అందరూ తెగ ఆరా తీస్తుంటారు. లేటెస్ట్ గా ఆయన తన సంపాదన గురించి చెప్పి అందరిని మైండ్ బ్లాక్ చేశారు.

ఒకే ఒక్క రీల్ కు రూ.76 లక్షలు..

ఇటీవల  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఓర్రీ.. తన బిజినెస్ సీక్రెట్స్‌ను బయటపెట్టాడు. లాస్ట్ మంత్ కేవలం ఒకే ఒక్క రీల్ (Reel) కోసం నేను అక్షరాలా రూ.76 లక్షలు తీసుకున్నాను అని చెప్పి హోస్ట్‌తో పాటు నెటిజన్లను సైతం నోరెళ్లబెట్టేలా చేశాడు. సాధారణంగా ఈవెంట్లకు సెలబ్రిటీలు రావడం చూసుంటారు. కానీ ఓర్రీ మాత్రం ఒక కొత్త బిజినెస్ మోడల్‌ను కనిపెట్టాడు. అదే పెయిడ్ ఫ్రెండ్ షిప్ (Paid Friendship).

పెయిడ్ ఫ్రెండ్ షిప్ బిజినెస్

తనపెయిడ్ ఫ్రెండ్ షిప్  దీని గురించి ఓర్రీ వివరిస్తూ.. నాకు ఈవెంట్లు, పెయిడ్ ఫ్రెండ్ షిప్స్ ద్వారానే ఎక్కువ డబ్బులొస్తాయని చెప్పుకొచ్చారు. ఒక రూ15 నుండి రూ.25 లక్షలు ఇస్తే నన్ను లంచ్ లేదా డిన్నర్‌కు బుక్ చేసుకోవచ్చు. మీ పెళ్లిళ్లు, బర్త్‌డే పార్టీలకు వస్తాను. మీతో కలిసి షాట్స్ వేస్తాను. మనమిద్దరం చిన్నప్పటి నుంచీ థిక్ ఫ్రెండ్స్ అన్న రేంజ్‌లో అందరి ముందు స్పీచ్ ఇస్తాను. ఇదొక కొనుక్కోదగ్గ ఎక్స్‌పీరియన్స్ అని కూల్‌గా చెప్పేశాడు.

ఆ ఇద్దరి పోజులే ఫేమస్..

ఇండియాలో కేవలం ఇద్దరి పోజులే బాగా ఫేమస్. ఒకటి షాహారుఖ్ ఖాన్, రెండు ఓర్రీ. నేను ఆ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్నాను అంటూ కాస్త క్రేజీగా తన పాపులారిటీని ఓర్రీ  చెప్పుకొచ్చారు. అంతేకాదు, తాను లక్షల్లో సంపాదిస్తున్నా.. ఇప్పటికీ తన అకౌంట్స్, ఫైనాన్స్ మొత్తం వాళ్ల అమ్మానాన్నలే చూసుకుంటారని..  ఆ విషయంలో తాను ఎప్పటికీ మారనని స్పష్టం చేశాడు.

ALSO READ : గొర్రెలా కాదు తోడేలులా.. 'ఆల్ఫా'లో ఆలియా భట్ విశ్వరూపం.. హృతిక్ ఎంట్రీతో గూస్‌బంప్స్!

 

నువ్వు తోపు బ్రో..

ఈ వీడియో వైరల్ అవ్వడంతో  నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. కార్పొరేట్ ఉద్యోగులు ఏళ్ల తరబడి కష్టపడినా సంపాదించలేని సొమ్మును ఓర్రీ ఒక్క రీల్‌తో గుంజేస్తున్నాడని కొందరు ప్రశంసిస్తున్నారు. పర్సనల్ బ్రాండింగ్‌లో ఇతడు నెక్స్ట్ లెవెల్ కేస్ స్టడీ. ఏమీ లేకుండానే ఇంత క్రేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఓర్రీని చూసి నేర్చుకోవాలి. ఇతనికి బిజినెస్ మైండ్ మామూలుగా లేదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు...