కొనసాగుతున్న సమ్మె..ఆత్మహత్యకు పాల్పడ్డ ఆర్టీసీ కార్మికుడు

కొనసాగుతున్న సమ్మె..ఆత్మహత్యకు పాల్పడ్డ ఆర్టీసీ కార్మికుడు

ఆర్టీసీకి చెందిన మరో కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారానికి 41వ రోజుకు చేరింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమ డిమాండ్లను నెరవేర్చాలని  కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. రోజులు తరబడి సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందిచడం లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని  భీష్మించుకొని కూర్చుంది. దీంతో ఆర్టీసీ కార్మికులు తమభవిష్యత్తు పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ కోసం కొంతమంది కార్మికులు కులవృత్తుల్ని నమ్ముకుంటుంటే మరికొందరు కూలీలుగా మారుతున్నారు.

అయితే ఈనేపథ్యంలో ప్రభుత్వ తీరుపై మనోవేధనకు గురైన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ఆర్టీసీ డిపోకు చెందిన  కార్మికుడు మేకల అశోక్ పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి ప్రయత్నించాడు. దీంతో భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు అశోక్ ను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.