కాలంతో పాటే మనిషి ప్రయాణం సాగుతోంది. ఈ జర్నీలో ముందుకు, వెనక్కు వెళ్లాలనే ప్రయత్నం ఊహకు కూడా అందనిది. కానీ, ఆ ఊహను నిజం చేసుకోవడానికి ఏండ్ల నుంచి ప్రయత్నిస్తున్నాడు. 'టైమ్ ట్రావెల్' పేరుతో ఎన్నో ఎక్స్ పెరిమెంట్లు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలకు మరింత బూస్ట్ అందించింది రుడాల్ఫ్ ఫెంజ్ ఉదంతం. కనిపించకుండా పోయిన ఒక వ్యక్తి ఐడెంటిటీకి సంబంధించిన ఈ మిస్టరీ కేసు గురించి.. ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకోవడం విశేషం.
అమెరికన్ రైటర్ జాక్ ఫిన్నె. 1951లో అ 'ఐయామ్ స్కేర్డ్' అనే ఒక కథను రాశాడు. ఆ కథలో ఒక వ్యక్తి కనిపించకుండా పోతాడు. కొన్నేళ్ల తర్వాత అదే వ్యక్తి ఒక మహానగరంలో ప్రత్యక్షం అవుతాడు. ఆ గందరగోళంలో అతని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ అజ్ఞాత వ్యక్తి ఐడెంటిటీ కనుగొనేందుకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేసే ప్రయత్నంతో మిగతా స్టోరీ నడుస్తుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ.. జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. కానీ, కొందరికి మాత్రం ఆశ్చర్యంగా అనిపించింది. కొన్నిరోజుల కిందట అలాంటి ఇన్నిడెంట్ ఒకటి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర నిజంగా జరిగిందని వాళ్లు విన్నారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో వెలుగు చూసిన విషయాలు.. ఇంచు మించు ఫిన్నె రాసిన కథకి దగ్గరగా ఉన్నాయి. అలా హిస్టరీలో ఇదొక ఇంట్రెస్ట్ ఇన్సిడెంట్ గా మిగిలింది.
పాపం రుడాల్ఫ్
1951 జూన్ నెలలో ఒకరోజు టైం రాత్రి పదకొందుంటావు. జనాలతో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ కిటకిటలాడుతోంది. సడన్ గా ఒక వ్యక్తి జనాల మధ్య ఊడిపడ్డాడు. అతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. కానీ, అతని గెటప్ వింతగా ఉంది. టేట్ నైంటీస్ ఫ్యాషన్ బట్టల్ని వేసుకున్నాడతను. అతని ముఖంలో ఏదో ఆందోళన. కంగారులో రోడ్డు దాటబోతుండగా యాక్సిడెంట్ అయ్యింది. అక్కడికక్కడే చనిపోయాడతను. అతని వయసు 30 లోపు ఉంటుంది. యాక్సిడెంట్ గురించి తెలిసి పోలీసులు అక్కడికి వచ్చారు. చనిపోయిన వ్యక్తి ఎవరో. అక్కడున్న ఎవరికీ తెలీదు. కానీ, అతని లాంగ్ కోటులో కొన్ని వస్తువులు దొరికాయి. ఐదు సెంటు విలువ చేసే ఒక బీర్ కాపర్ టోకెన్, గుర్రం బాగోగులు చూసుకున్నట్లు ఒక బిల్లు, 70 డాలర్ల పాత బ్యాంకు నోట్లు, రుణాల్ఫ్ ఫెంజ్ పేరుతో ఉన్న కొన్ని బిజినెస్ కార్డులు ఉన్నాయి. వాటితో పాటు 1876లో ఫిలడెల్ఫియా నుంచి ఫిఫ్ట్ ఎవెన్యూ అడ్రస్, వచ్చిన ఒక పోస్ట్ కార్డు ఉంది. వాటి ఆధారంగా ఎంక్వైయిరీ చేయాల్సిందిగా న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన హబర్ట్ రియ ఆర్టర్స్ పాస్ అయ్యాయి. అయితే కేసు టేకప్ చేసిన నెల రోజుల తర్వాత ఎలాంటి క్రూస్ దొరకలేదని చెబుతూ ఆ కేసును క్లోజ్ చేశాడు రియమ్. కానీ ఈ కేసుకు సంబంధించిన వివరాలను తన దైరీలో రాసి పెట్టుకున్నాడతను. 1987లో ఆ డైరీని మీడియా ముందు రిలీజ్ చేశాడు రియమ్ కొడుకు.
టెలిఫోన్ బుక్ తో మొదలై..
చనిపోయిన వ్యక్తి ఫొటో, అతని కోటులో దొరికిన వస్తువులతో కేసును ముందుకు తీసుకెళ్లాడు. రియమ్. ఫిష్ ఎవెన్యూలో అతని వివరాల కోసం ఆరా తీశాడు. ఎక్కడా చిన్న క్లూ దొరకలేదు. చనిపోయిన వ్యక్తి ఫింగర్ ప్రింట్స్.. రికార్డుల్లో ఎక్కడా మ్యాచ్ కావట్లేదు. అడ్రస్ బుక్లో అతని వివరాలు కూడా లేవు. పైగా అతని గురించి ఎవరూ మిస్సింగ్ కంప్లయింట్ కూడా ఇవ్వలేదు. అయితే పాత టెలిఫోన్ బుక్ లో అలాంటి పేరు ఏదైనా ఉందా? వెతికాడు. 1939 టెలిఫోన్ బుక్ లో రుణాల్ఫ్ ఫెంజ్ జూనియర్ అనే వ్యక్తి గురించి డీటెయిల్స్ ఉన్నాయి. ఆ అడ్రస్ ఒక అపార్ట్మెంట్ ఉంది. అక్కడికెళ్తే.. అవ్యక్తి పదేండ్ల క్రితమే రిటైర్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోయాడని చుట్టుపక్కల వాళ్లు చెప్పారు. జూనియర్ ఫెంజ్ పని చేసిన కంపెనీ నుంచి బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకున్నాడు. రియమ్. అవి పట్టుకుని ఫ్లోరిడాలో ఆ అడ్ర వెళ్లాడు. అయితే జూనియర్ ఫెంజ్ చనిపోయి అప్పటికే ఐదేండ్లు అవుతోంది. అతని భార్య ఒంటరిగా ఉంటోంది. అజ్ఞాతవ్యక్తి ఫొటో చూపించి 'ఈ వ్యక్తి తెలుసా?' అని అడిగాడు రియమ్. లోపలికి వెళ్ళి పాత ఆల్బమ్ తెచ్చి చూపించింది ఆమె. ఆ ఫొటోల్లో ఒక వ్యక్తి.. చనిపోయిన వ్యక్తి. ఇద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నారు. ఆయన పేరు రుడాల్ఫ్ ఫెంజ్. జూనియర్ రుడాల్ఫ్ తండ్రి. 29 ఏండ్ల వయసులో (1876 జూన్లో) ఇంటి నుంచి వెళ్లాడు. ఏమైందోగానీ తిరిగి రాలేదు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవటంతో ఏడేళ్ల తర్వాత పోలీసులు అతను చనిపోయినట్లు డిక్లేర్ చేశారు.
►ALSO READ | మీకు తెలుసా : డ్రైవ్ ఇన్ ధియేటర్ కు 100 ఏళ్లు.. ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..?
కేస్ క్లోజ్ .. వెంటనే కథ
హుబర్ట్ రియమ్ కి ఈ కేసు చాలా టిపికల్గా అనిపించింది. ఒక మిస్సింగ్ పర్సన్.. దాదాపు యాభై ఏండ్లు ఏమైపోయాడు. అదే వయసులో మళ్లీ ఎలా ప్రత్యక్షమయ్యాడు. అతని గురించి డిటైయిల్స్ చెప్పడానికి ఎవరూ బతికి లేరు. ఈ అనుమానాల మధ్య కేసులో ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెబుతూ మిస్టీరియస్ డెత్ కేసు క్లోజ్ చేశాడు. 'ఈ కేసు సైకలాజికల్ గా నన్ను ఎంతో ఇబ్బంది పెట్టింది. కొన్నాళ్లు. ఎంక్వైయిరీ ఇలాగే చేసి ఉంటే పిచ్చోడిని అయిపోయేవాడినేమో' అని అతను డైరీలో రాసుకున్నాడు. రియమ్ చనిపోయిన కొన్నాళ్ల తర్వాత దైరీని అతని కొడుకు బయటపెట్టాడు. కానీ, అదంతా పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్ అని కొందరు కొట్టిపారేశారు. అంతేకాదు జాక్ ఫిన్నె కథ ఎప్పుడు (ఏ తేదీన) పబ్లిష్ అయ్యిందనేది ఎక్కడా చెప్పలేదు. దీంతో రియమ్ ఫ్యామిలీ కట్టుకథ అల్లి ఉంటుందని అంతా లైట్ తీసుకున్నారు.
క్రిస్ అయుటెక్ థీసిస్
'రుడాల్ఫ్ ఫెంజ్ టైమ్ ట్రావెల్' గురించి ఎన్నో కథలు, మరెన్నో ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. 1980లో ఫెంజ్ కథ ఎక్కువగా వైరల్ అయ్యింది. ఇంటర్నెట్ రాకతో అది మరింతగా పాకింది. 2002లో 'మాసా అలా' మేగజైన్లో కరోబోస్ డనాలెల్స్ అనే రైటర్ ఈ ఇన్సిడెంట్ గురించి ఒక స్టోరీ రాశాడు. క్రిస్ ఆయుటెడ్ అనే వ్యక్తి అస్టోరీపై ఇంట్రెస్ట ఈ ఉదంతంపై స్టడీ చేసి ఒక థీసిస్ రాశాడు. 'రుడాల్ఫ్ తరహా కథలు స్వీడన్, నార్వేలతో పాటు ఎన్నో దేశాల్లో చక్కర్లు కొట్టాయి. 1972లో జర్నల్ అఫ్ బార్డర్ లాండ్ రీసెర్చ్ అనే మేగజైన్ తొలిసారి దీనిపై ఒక స్టోరీ రాసింది. ఏలియన్స్, పారానార్మల్ యాక్టివిటీస్ ను నమ్మే రీడర్స్.. ఆ మేగజైన్ టార్గెట్. అందుకే కథను క్రియేట్ చేసి రాసింది. అక్కడి నుంచే ఈ కథలు మొదలయ్యాయి' అని క్రిస్ ఆధీసిస్లో రాశాడు. అయితే జార్జ్ మార్క్ అనే వ్యక్తి మాత్రం ఆ థీసిస్ ను తప్పని చెప్పాడు. ఆ కథ ఇంకా పాతదని, జాక్ ఫిన్నె రాసిన 'ఐయామ్ స్కేర్ల్' ఇదే థీమ్ తో ఉంటుందని చూపించాడు. కానీ, జాక్ ఫిన్నె ఆ కథ ఇంట్రడక్షన్లో అది తన సొంత కథ అని రాయడంతో ఇదే నిజమని నమ్ముతున్నారు చాలామంది.
రుడాల్ఫ్ ఏమయ్యాడు
టైమ్ ట్రావెల్ అనేది సాధ్యమయ్యే విషయం కాదని చాలా మంది. సైంటిస్టులు చెప్పే మాట. ఆ లెక్కన రుడాల్ఫ్ ఇన్సిడెంట్ ఒక కథగా చెప్తుంటారు. ఒకవేళ ఇది నిజంగా కథ అనుకుంటే. 1876లో న్యూయార్క్ పోలీస్ డిపార్టెమెంట్ రికార్డుల్లో రుడాల్ఫ్ ఫెంజ్ మిస్సింగ్ కేసు రికార్డ్ కావడం అబద్ధం కాదు. 1951లో ఆ కేసును డీల్ చేసిన కెప్టెన్ హుబర్ట్ రియమ్ ఇన్వెస్టిగేషన్ అబద్ధం కాదు. అలాంటప్పుడు ఇంటి నుంచి వెళ్లిన రుడాల్ఫ్ ఏమైపోయాడు? న్యూయార్క్ స్క్వేర్లో చనిపోయిన వ్యక్తి. రుడాల్ఫ్ పోలికలు ఒకేలా ఎందుకు ఉన్నాయి? నిజంగా అతను టైమ్ ట్రావెల్ చేశాడా? చేస్తే ఎలా చేశాడు? 'టైమ్ ట్రావెల్ థియరీల' గురించి స్టడీ చేస్తున్న రీసెర్చర్లు ఎందరికో ఇవన్నీ ఆసక్తి కలిగించిన ప్రశ్నలు. ఆ ప్రశ్నల కంటే ఇంటర్నెట్ లో వైరల్ అయ్యే కథలే ఈ మిస్సింగ్ మిస్టరీకి టైమ్ ట్రావెల్ క్లెయిమ్స్ లో ఒక స్థానం కల్పించాయి.
