మెగా156 కోసం మరో పవర్ఫుల్ పెన్ సిద్ధం!

 మెగా156 కోసం మరో పవర్ఫుల్ పెన్ సిద్ధం!

మెగాస్టార్ చిరంజీవి Megastar Chiranjeevi) హీరోగా, బింబిసారా దర్శకుడు వశిష్ట(Vassishta) డైరెక్షన్ లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. మెగా156(Mega156) అనే వర్కింగ్ టైటిల్ తో వస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీని యూవీ క్రియేషన్స్(UV Creations) సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 

మెగా156 మూవీ కోసం డైరెక్టర్ వశిష్ట తన పెన్నుకు చాలా విధాలుగా పని పెట్టాడని సమాచారం. మూడు లోకాల కాన్సెప్ట్ తో సినిమా కథను పంచభూతాలతో కూడిన సోషియో ఫాంటసీగా తెరకెక్కుతుంది. ఇక ఈ కథలో మొత్తంగా ఐదుగురు హీరోయిన్స్ ను తీసుకోనున్నాడని టాక్ వినిపిస్తోంది.

అలాగే ఈ సినిమా కోసం ఒక పవర్ ఫుల్ టెక్నిషియన్ సాయి మాధవ్ బుర్రా(Sai Madhav Burra) ను తీసుకున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి  ఖైదీ నెంబర్ 150, సైరా,  RRR, గౌతమి పుత్ర శాతకర్ణి, NTR బయోపిక్, మహానటి వంటి సినిమాలకు డైలాగ్స్ అందించారు. ప్రస్తుతం హరి హర వీరమల్లు, కల్కి వంటి మూవీస్ కు మాటలు అందిస్తున్న అందించిన సాయి మాధవ్ బుర్ర..ఈ మెగా 156 ప్రాజెక్టుకు డైలాగ్స్ అందించబోతున్నట్లు సమాచారం.

దీంతో మెగా 156 పై అంచనాలు మరింత పెరిగాయి. సాయి మాధవ్ బుర్రా తన కెరీర్ స్టార్టింగ్ లో చాలా సీరియళ్లకు కథ, మాటలు, పాటలు అందించారు. ఇక క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన కృష్ణం వందే జగద్గురుం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

మైథలాజికల్ జానర్ లో రానున్న ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ తోనే..మెగా ఫ్యాన్స్ కు హై లెవెల్ హోప్స్ ఇచ్చారు డైరెక్టర్. ఇలా రిలీజైన ప్రతి పోస్టర్ లో మెగా మాస్..బియాండ్ యూనివర్స్ అనే క్యాప్షన్ ఇస్తూ వస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మెగా156 గ్రాఫిక్స్ వర్క్ కోసం దాదాపు ఆరు నెలల టైం తీసుకోబోతున్నారట మేకర్స్.