తారక్ ఫ్యాన్స్‌కు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్.. నేరుగా ఎన్టీఆర్‌కే ట్యాగ్ చేస్తూ పోస్ట్!

తారక్ ఫ్యాన్స్‌కు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్.. నేరుగా ఎన్టీఆర్‌కే ట్యాగ్ చేస్తూ పోస్ట్!

సోషల్ మీడియాలో ఏఐ ఫేక్ ఫొటోలు, డీప్‌ఫేక్ వీడియోల వ్యవహారం రోజురోజుకూ హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్‌గా ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్‌లో వచ్చిన 'దేవర' సినిమాలోని చుట్టమల్లే పాటపై అసభ్యకరమైన ఏఐ వీడియోలు వైరల్ కావడం, దానిపై చిత్రసీమ మండిపడటం తెలిసిందే. అయితే ఈ వివాదంలోకి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఎంట్రీ ఇవ్వడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఏకంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఫొటోనే ఏఐ మార్ఫింగ్ చేసి..  చుట్టమల్లే వీడియో కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అంటూ ఓ వ్యక్తితో సజ్జనార్ ఉన్నట్లున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన సీపీ సజ్జనార్ ఒక్కసారిగా షాక్ అయి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ దారుణాన్ని సీరియస్‌గా తీసుకున్న సజ్జనార్.. ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (@tarak9999)కి ట్యాగ్ చేస్తూ  'ఎక్స్ లో గట్టిగా క్లాస్ పీకారు.  తారక్ గారూ.. మీ అభిమానుల పేరిట నా ఫొటోనే ఏఐతో మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేస్తున్నారు.. కొంచెం గమనించండి. ఏఐతో సృష్టించే నకిలీ చిత్రాలు చూడటానికి నిజంలాగే అనిపిస్తాయి. ఫ్యాక్ట్ చెక్ చేయకుండా దేన్నీ గుడ్డిగా నమ్మి షేర్ చేయకండి అని సీపీవార్నింగ్ ఇచ్చారు. సజ్జనార్ ట్వీట్ దెబ్బకు ఆ మార్ఫింగ్ ఫొటో పోస్ట్ చేసిన అకౌంట్ హోల్డర్ క్షమాపణలు చెబుతూ పోస్ట్‌ను డిలీట్ చేశాడు.

►ALSO READ | టాలీవుడ్ డ్యాన్సర్ అసోసియేషన్‌ ఎన్నికలకు బ్రేక్‌.. అక్టోబర్ 11 పోల్స్‌పై హైకోర్టు కీలక స్టే!

ఇప్పటికే ఈ డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీ కపూర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తగా.. ఎన్టీఆర్ సైతం ఎవరినీ వదిలిపెట్టను.. చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటా అని హెచ్చరించారు. మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ వంటి ఇండస్ట్రీ పెద్దలు సైతం ఈ డీప్‌ఫేక్స్ పై నిరసన గళం విప్పారు.

మొత్తానికి, సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఫొటో నిజం కాదు. ఫ్యాక్ట్ చెక్ చేయకుండా కంటెంట్‌ను షేర్ చేయడం వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించడమే కాకుండా తప్పుడు సమాచార వ్యాప్తికి కారణమవుతుంది. సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించడం, డీప్‌ఫేక్‌లను అడ్డుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.