బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన ప్రాణ స్నేహితుడు.. ఖల్ నాయక్ సంజయ్ దత్‌పై కురిపించిన ప్రేమ నెట్టింట సెన్సేషన్‌గా మారింది. జులై 29న 67వ వసంతంలోకి అడుగుపెట్టిన సంజయ్ దత్‌కు కాస్త ఆలస్యంగా.. ఆగస్టు 1 శనివారం తెల్లవారుజామున సల్మాన్ ఓ క్రేజీ బర్త్‌డే విషెస్ పోస్ట్ చేశారు. ఇద్దరు లెజెండ్స్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ సల్మాన్ రాసిన ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
బాబా.. ఎప్పటికీ మా బాబాయే..
'బాబా ఫరెవర్... సంజూ బాబా మనందరికీ బాబా. ఇప్పుడు తన పిల్లలకి కూడా బాబా. నా పెద్దన్న సంజయ్ దత్‌ను అల్లా, భగవాన్, జీసస్ ఎప్పటికీ సంతోషంగా ఉంచాలి. ఐ లవ్ యూ బాబా!' అంటూ సల్మాన్ తన అద్భుతమైన స్నేహాన్ని చాటుకున్నాడు. సంజయ్ దత్‌ను గాఢంగా కౌగిలించుకున్న ఫోటోలను షేర్ చేశారు. ఇద్దరి మధ్య ఉన్న బంధానికి అద్దం పడుతోందంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. బహుశా ఇది సంజయ్ దత్ ఇంట్లో జరిగిన స్పెషల్ రీయూనియన్ అని అభిమానులు మురిసిపోతున్నారు.
Babaaaa for ever baba aur baba ,baba hota hai. Sanju baba hai hum sab ka baba n Sanju baba now apne bacchon ka baba , mera bada bhai Sanjay Dutt, Allah,Bhagwan Jesus sab iss Aadhmi ko khush rakhain, I love you Baba. pic.twitter.com/chd2ZBdnFJ
— Salman Khan (@BeingSalmanKhan) July 31, 2026
దశాబ్దాల స్నేహం..
వీరిద్దరి స్నేహం ఈనాటిది కాదు, దశాబ్దాలుగా బాలీవుడ్‌లో వీరు బెస్ట్ ఫ్రెండ్స్. 'సాజన్' (1991), 'చల్ మేరే భాయ్'(2000),'యే హై జల్వా' (2002) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో వీరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. తెరవెనుక కూడా ఒకరికొకరు అండగా నిలుస్తూ నిజమైన స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.
ALSO READ : Renu Desai: మమ్ముట్టి భార్య పాత్రలో రేణుదేశాయ్..
ఫుల్ బిజీగా స్టార్స్...
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ గల్వాన్ వ్యాలీ ఘర్షణల నేపథ్యంలో సాగే 'మాతృభూమి' (Maatrubhumi) అనే భారీ వార్ డ్రామా నటిస్తున్నారు. ఈ పవర్‌ఫుల్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇక సంజయ్ దత్ ఇటీవల 'ధురంధర్: ది రివెంజ్' వంటి వరుస బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ కొట్టారు. ఇప్పుడు తన 1993 కల్ట్ క్లాసిక్ ఫ్రాంచైజీ 'ఖల్ నాయక్ రిటర్న్స్' (Khalnayak Returns) తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.
