ముంబై లోకల్ ట్రైన్లో సల్మాన్ ఖాన్ డ్యాన్స్

ముంబై లోకల్ ట్రైన్లో  సల్మాన్ ఖాన్ డ్యాన్స్

ముంబై లోకల్ ట్రైన్లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ప్రయాణించాడు. ప్రయాణించడమే కాదండోయ్..లోకల్ ట్రైన్లో డ్యాన్సులతో ఇరగదీశాడు. బాలీవుడ్ పాపులర్ సాంగ్స్కు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేశాడు.  ప్రస్తుతం సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. 

సల్మాన్ ఖాన్ నిజంగా డ్యాన్స్ చేశాడా..?

సల్మాన్ ఖాన్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో..నిజంగానే సల్మాన్ ఖాన్ ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణించాడా.? నిజంగానే సల్మాన్ ఖాన్ డ్యాన్స్ చేశాడా అని అభిమానులు తెగ వెతికేస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..లోకల్ ట్రైన్ లో డ్యాన్స్ చేసింది నిజమైన సల్మాన్ ఖాన్ కాదు..డూప్. అవును అచ్చం సల్మాన్ ను పోలిన ఓ వ్యక్తి.. ముంబై లోకల్ ట్రైన్ లో హల్ చల్ చేశాడు. అచ్చం సల్మాన్ ఖాన్ లాగే హావభావాలు పలికించాడు. డ్యాన్సు సైతం సల్మాన్ ఖాన్ లాగే చేయడంతో..అభిమానులు కొద్దిసేపు గుర్తు పట్టలేకపోయారు. 

Also Read :- అల్లు అర్జున్‌‌తో కలిసి రీల్ చేయాలని ఉంది: డేవిడ్ వార్నర్