సల్మాన్ టైగర్ 3 టీజర్ వచ్చేసింది.. బతికున్నంతవరకు ఓటమి లేదు

సల్మాన్ టైగర్ 3 టీజర్ వచ్చేసింది.. బతికున్నంతవరకు ఓటమి లేదు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman khan) నుండి వస్తున్న అవుట్ అండ్ అవుట్  స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ టైగర్ 3(Tiger 3). యశ్ రాజ్ ఫిలిమ్స్(Yash raj films) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను మనీష్ శర్మ(Maneesh sharma) తెరకెక్కిస్తున్నారు. కత్రినా కైఫ్(Katrina kaif) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.

Also Read : జైలర్ 2 కోసం అడ్వాన్స్ అందుకున్న దర్శకుడు.. స్టార్ హీరోస్ రేంజ్ రెమ్యునరేషన్

తాజాగా టైగర్ 3 సినిమా నుండి టైగర్ కా మెసేజ్ పేరుతో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సల్మాన్ ఖాన్ లుక్స్, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. టీజర్ చుసిన ఆడియన్స్ మరీ ముఖ్యంగా సల్మాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా ఇప్పటివరకు ఉన్న ఇండియన రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేయడం ఖాయం అని కామెంట్స్ చేస్తన్నారు. 

ఇక టైగర్ 3 సినిమాను 2023 దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇక YRF స్పై యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే షారుఖ్ నటించిన పఠాన్ సినిమాలో సల్మాన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు టైగర్ 3లో షారుఖ్ గెస్ట్ అప్పిరెస్ ఇవ్వనున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక నిజమైతే టైగర్3 సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.