చై టాటూని తొలగించిన సమంత..కారణం ఇదే!

చై టాటూని తొలగించిన సమంత..కారణం ఇదే!

టాలీవుడ్ బ్యూటీ సమంత(Samantha) తన లేటెస్ట్ పిక్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పింక్ కలర్ శారీలో ఉన్న ఫోటోస్, వీడియోస్  తన ఇన్స్టా లో షేర్ చేసి..కొత్త చర్చకు దారీ తీసేలా చేసింది. ఈ పింక్ కలర్ శారీలో సమంత ఇచ్చిన పోజుల్లో తన సీక్రెట్ టాటూ..అంటే, చై పేరుతో ఉండే టాటూ కనిపించలేదు. దీంతో సమంత ఆ టాటూని పూర్తిగా తొలిగించేసిందని టాక్ వినిపిస్తోంది.

గతంలో తను ఇచ్చిన నడుము ఫోజుల్లో చై అనే పేరుతో  టాటూ ఉండేది. కానీ లేటెస్ట్ పిక్స్లో అది కనిపించడం లేదు. దీంతో ఇదే విషయంపై పెద్ద చర్చ జరుగుతుంది. ఇక సమంత పూర్తిగా నాగ చైతన్య (Naga Chaitanya) మెమోరీస్‌ను అవైడ్ చేసినట్లు అర్థం అవుతోంది.

రీసెంట్గా సమంత దగ్గర ఉండాల్సిన పెట్డాగ్ హష్..నాగ చైతన్య వద్దకు ఎలా వచ్చింది..త్వరలో వీరిద్దరూ కలుస్తున్నారా..అంటూ న్యూస్ ట్రెండ్ అయ్యింది. ఇంతలోనే సమంత తన నడుం ఒంపులతో..చై టాటూ లేదంటూ చూపించింది. ఇక వీరిద్దరూ కలుస్తారనే ఆశలను..చై, సామ్ ఫ్యాన్స్ కు ఇక లేనట్లే అనిపిస్తోంది. 

సమంత టాటూల విషయానికి వస్తే..

సామ్ మెడ మీద ఉన్న వైఎంసీ (ఏం మాయ చేశావే) అని మీనింగ్ వచ్చేలా షార్ట్ ఫామ్‌లో టాటూ ఒకటి ఉండగా..తన కుడి చేతి మీద మరొక టాటూ ఉంటుంది. నాగ చైతన్య, సమంత చేతుల మీద ఒకేరకమైన..రెండు గీతలతో టాటూస్ కూడా ఉంటాయి. ఆ టాటూని సమంత అలానే ఉంచేసుకుంది. ఇక ఆ రెండు గీతల మీనింగ్ ఏంటనేది..సమంత అప్పట్లోనే బయటకు రివీల్ చేసింది. నీ మార్గాన్ని నువ్వు ఎంచుకో..క్రియేట్ చేసుకో అనే అర్థంలో ఆ రెండు గీతలను వాడుతారట. మరొకటి ఎదకి దగ్గరగా సీక్రెట్ ప్లేస్‌లో వేయించుకున్న చై అనే టాటూ. లేటెస్ట్ గా సమంత పోస్ట్ చేసిన పిక్స్ తో మరోసారి టాటూల విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.