టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన చిత్రం 'లెనిన్' ఈ రోజు ( జులై 10, 2026 ) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైంది. డైరెక్టర్ అబ్బూరి మురళి కిశోర్ తెరకెక్కించిన ఈ భారీ రూరల్ యాక్షన్ డ్రామా ఎలాంటి ప్రీమియర్ షోలు లేకుండా నేరుగా సాధారణ టికెట్ ధరలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేక ప్రదర్శనలతో సందడిచేస్తోంది.
ఎలా ఉందంటే?
సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ మూవీ గురించి ప్రేక్షకులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా అఖిల్ నటన, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఫస్ట్ హాఫ్‌లోని ఎమోషనల్ సన్నివేశాలు, ప్రీ-ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్, ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు ప్రధాన బలమని చెబుతున్నారు.
గ్రామంలో అన్యాయాన్ని ఎదిరిస్తూ ఓ గ్రామ పెద్దకు సవాల్ విసిరే యువకుడిగా అఖిల్ నటన ఆకట్టుకుందని ప్రేక్షకులు పేర్కొంటున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అందించిన వాయిస్ ఓవర్ సినిమాకు మరింత బలం చేకూర్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ట్విస్టులు, యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయని పలువురు పోస్టులు చేస్తున్నారు.
సమంత స్పెషల్ విషెస్..
ఇదిలా ఉండగా.. హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. అఖిల్‌తో పాటు 'లెనిన్' చిత్రబృందానికి ఆమె ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అఖిల్, 'లెనిన్'టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా భారీ బ్లాక్‌బస్టర్ అయ్యే సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. మీ అందరికీ గొప్ప విజయం దక్కాలని కోరుకుంటున్నా అంటూ సమంత చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
►ALSO READ | DQ41 Title: దుల్కర్-పూజా మూవీకి క్లాసిక్ టైటిల్.. ప్రేమకథకు శ్రీకారం చుట్టిన క్రేజీ స్టార్స్
కాగా.. ఇటీవల సమంత నిర్మించి నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రానికి అఖిల్ కూడా తన శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సమంత 'లెనిన్'కు మద్దతుగా నిలవడంతో ఇద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వక అనుబంధంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం 'లెనిన్' కు వస్తున్న తొలి స్పందనలతో వీకెండ్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
