Sanju vs Klaasen: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మే 18న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ఉత్కంఠభరిత మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కానీ ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్, చెన్నై వికెట్‌కీపర్ సంజు మధ్య గొడవ జరిగింది. తాజాగా ఈ వివాదంపై సంజు శాంసన్ తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఒక ఎమోషనల్ స్టోరీ, వీడియోతో ఈ గొడవ పూర్తిగా ముగిసిపోయినట్లు అర్థమవుతుంది.
హైదరాబాద్ జట్టు 181 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 15వ ఓవర్‌లో ఈ గొడవ జరిగింది. నూర్ అహ్మద్ వేసిన బాల్‌ను సంజు మెరుపు వేగంతో అందుకుని క్లాసెన్‌ను స్టంప్ ఔట్ చేసేశాడు. ఈ సందర్భంగా తన జట్టు ఆటగాళ్లతో కలిసి సంజు సంబరాలు చేసుకుంటున్న సమయంలో క్లాసెన్‌తో చిన్నపాటి కొట్లాట జరిగింది.
ఈ మ్యాచ్ జరిగిన రెండు రోజుల తర్వాత సంజు శాంసన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. క్లాసెన్‌ను తాను కౌగిలించుకున్న ఒక ఫోటోను షేర్ చేస్తూ, ఆటలో భాగంగా స్టేడియంలో ఇలాంటివి జరుగుతుంటాయని కానీ బయట మాత్రం క్లాసెన్ అంటే తనకు ఎంతో ప్రేమ గౌరవం ఉందని శాంసన్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు 2024 నాటి తమిళ సినిమా సత్యం సుందరంలోని పాటను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా చేర్చాడు. గ్రౌండ్ లో గొడవలు జరిగినప్పటికీ వ్యక్తిగతంగా వారి మధ్య మంచి బంధాన్ని ఈ పోస్ట్ లో తెలియజేస్తుంది.
►ALSO READ | Yuvraj Singh: ఈ పిల్లాడిని విడిచి పెట్టొద్దు.. వైభవ్పై యువరాజ్ సింగ్ ప్రశంసలు..
మరోవైపు, హెన్రిచ్ క్లాసెన్ కూడా సంజు శాంసన్‌తో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, బ్రదర్ నీపై నాకు చాలా ప్రేమ, గౌరవం ఉన్నాయి.. నువ్వు ఆడే ఆట నాకు చాలా ఇష్టం.. ఇలాగే ఎప్పుడూ బాగా ఆడు.. మన మధ్య ఎలాంటి గొడవలూ లేవు అంతా బాగుంది.. వచ్చే మ్యాచ్‌లో మళ్లీ కలుద్దాం అంటూ క్లాసెన్ కూడా రాసుకొచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య జరిగిన గొడవకి బ్రేక్ పడినట్లే కనిపిస్తుంది.
Heinrich klaasen and Sanju samson recent Instagram story 🧡💛👌 pic.twitter.com/2P3uXiblPL
— Open_talks_bhargav 🗣️🎙️🦅 (@sunriseshydi) May 20, 2026
