CSK vs SRH: క్రికెట్ స్టేడియంలో సంజు శాంసన్, హెన్రిచ్ క్లాసెన్ లు చాలా కూల్‌గా కనిపిస్తారు. కానీ నిన్నటి మ్యాచ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఊహించని రీతిలో రచ్చ కొనసాగింది. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఈ టఫ్ ఫైట్ లో ఒక వికెట్ విషయంలో గొడవ స్టార్ట్ అయింది.. చివరకు తీవ్ర వివాదానికి దారి తీసింది. క్లాసెన్ అవుట్ అయిన తర్వాత శాంసన్ వైపు చూస్తూ ఉమ్మి వేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
చెన్నై ఇచ్చిన 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది హైదరాబాద్. 15వ ఓవర్‌లో నూర్ అహ్మద్ వేసిన 3వ బంతిని క్లాసెన్ భారీ షాట్ ఆడబోయి మిస్ అయ్యాడు. బంతిని అందుకున్న వికెట్ కీపర్ సంజు శాంసన్ మెరుపు వేగంతో క్లాసెన్‌ను స్టంప్ అవుట్ చేసేశాడు. దీంతో రివ్యూలో క్లాసెన్ కాలు కొంచెం గాలిలో ఉండటంతో థర్డ్ అంపైర్ ఔట్ ప్రకటించాడు. కానీ తాను అవుట్ కాదని క్లాసెన్ అనుకున్నాడు. అప్పుడు శాంసన్ తన వైపు సీరియస్‌గా చూడటంతో క్లాసెన్‌కు ఒక్కసారిగా కోపం వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరింది. అంపైర్లు, తోటి ఆటగాళ్లు సర్దిచెప్పినా క్లాసెన్ కోపంతో ఊగిపోయాడు.
క్లాసెన్ ప్రవర్తన దారుణం:
డగౌట్ వైపు వెళ్తున్న హెన్రిచ్ క్లాసెన్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి సంజు శాంసన్ సైడ్ చూస్తూ ఉమ్మి వేశాడు. ఈ విజువల్స్ కెమెరాకు చిక్కాయి. క్లాసెన్ వంటి ప్రొఫెషనల్ ప్లేయర్ ఇలా ప్రవర్తించడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. సంజు ఏమైనా తిట్టాడా? లేక క్లాసెన్ కేవలం అవుట్ అయిన కోపంలో అలా చేశాడా? అన్నది నెట్టింట జోరుగా చర్చ కొనసాగుతుంది. ఇద్దరి మధ్య జరిగిన ఈ గొడవతో గ్రౌండ్‌లో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్లాసెన్ ప్రవర్తనపై బీసీసీఐ (BCCI) ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని అందరి వేచి చూస్తున్నారు.
►ALSO READ | ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే 'రాజస్థాన్' గెలవాల్సిందే.. లక్నో షాకిస్తుందా?
క్లాసెన్ పై చెన్నై ఫ్యాన్స్ ఫైర్:
ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ పై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజుపై కావాలనే క్లాసెన్ నోరుపారేసుకున్నాడంటూ మండపడుతున్నారు. ఈ సందర్భంగా క్లాసెన్ సోషల్ మీడియా అకౌంట్లోకి వెళ్లి మరీ కామెంట్ల సెక్షన్లలో భాయ్ కోపం తగ్గించుకో.. మా సంజు శాంసన్ జోలికి వస్తే మంచిగా ఉండదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక క్లాసెన్ కూడా కొందరు ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ సపోర్టు చేస్తున్నారు. వికెట్ పడిన కోపంలో సంజుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆటలో ఇలాంటివి కామన్ అంటూ పేర్కొంటున్నారు.
Henrich Klassen abused Sanju Samson after stumping him ?🤬🤬
— Indian Cricket (@IPL2025Auction) May 18, 2026
What's your views on this?? #CSKvsSRH pic.twitter.com/pWrTTkxdny
