27, 28 తేదీల్లో ట్రంప్, కిమ్ చర్చలు

27, 28 తేదీల్లో ట్రంప్, కిమ్ చర్చలు

ఈనెల 27, 28వ తేదీల్లో అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ఉత్త‌ర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మ‌ధ్య రెండ‌వ సారి చ‌ర్చ‌లు జరగనున్నాయి. వియ‌త్నాంలోని హ‌నోయ్‌ లో చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు ఇవాళ ట్రంప్ ట్వీట్ చేశారు. రెండు దేశాల మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. త‌మ దేశ ప్ర‌తినిధులు ఉత్త‌ర కొరియా నేత‌ల‌తో మాట్లాడిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలో.. ఉత్త‌ర కొరియా ఆర్థిక‌శ‌క్తిగా వెలుగుతుంద‌న్న ట్రంప్.. అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచే స‌త్తా కిమ్‌ కు ఉంద‌ని, కానీ.. త‌న‌ను మాత్రం అత‌ను ఏమీ చేయ‌లేడన్నారు. తానేంటో అత‌నికి తెలుస‌ని ట్రంప్ అన్నారు. ఉత్త‌ర కొరియా త‌న అణుఆయుధాల‌ను పూర్తిగా నిర్వీర్యం చేయాల‌ని అమెరికా డిమాండ్ చేస్తుంది. ఆ ద‌శ‌లో ఈ రెండు దేశాలు ప‌రోక్ష హెచ్చ‌రిక‌లు చేసుకున్నాయి. ఆ త‌ర్వాత ట్రంప్‌, కిమ్‌లు సింగ‌పూర్‌ వేదిక‌పై క‌లుసుకున్నారు. ఇప్పుడు హ‌నోయ్‌ లో రెండ‌వ‌సారి క‌లుసుకోబోతున్నారు.