OTTలోకి షారుఖ్ ఖాన్ జవాన్.. స్ట్రీమింగ్ ఎప్పుడు?

OTTలోకి షారుఖ్ ఖాన్ జవాన్.. స్ట్రీమింగ్ ఎప్పుడు?

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shahrukh khan) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ జవాన్(Jawan). తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. విడుదలై నెల రోజులు గడుస్తున్నా చాలా చోట్ల సూపర్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా. ఇప్పటికే పఠాన్ సినిమా వెయ్యి కోట్లు కొల్లగొట్టిన షారుఖ్.. ఇప్పుడు జవాన్ సినిమాతో తన రికార్డ్ ను తానే బ్రేక్ చేసుకున్నాడు. దీంతో బాలీవుడ్ తనకు తానే పోటీ అని నిరూపించుకున్నాడు.

ఇదిలా ఉంటే.. జవాన్ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను నవంబర్ 2 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే జవాన్ ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన అయితే రాలేదు.

ALSO READ: ఒకప్పుడు తాజ్ హోటల్ వెయిటర్.. నేడు స్టార్ యాక్టర్!

ఇక జవాన్ సినిమా విషయానికి వస్తే.. రెండు చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై గౌరీ ఖాన్ నిర్మించిన ఏ సినిమాలో.. దీపికా పదుకొనె, నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించారు.