ఒకప్పుడు తాజ్ హోటల్ వెయిటర్.. నేడు స్టార్ యాక్టర్!

ఒకప్పుడు తాజ్ హోటల్ వెయిటర్.. నేడు స్టార్ యాక్టర్!

సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎవరు..ఏ స్థాయి నుంచి వచ్చి.. ఏ స్థాయికి వెళతారనేది ఎవ్వరం చెప్పలేము. తినడానికి తిండి కూడా లేని స్థాయి నుంచి..సినిమా ఇంస్ట్రీలో పనిచేసే వారికి..డైరెక్ట్ గా, ఇన్ డైరెక్ట్గా అన్నం పెట్టె స్థాయికి వచ్చిన వారున్నారు.

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్తో పాటు..సహనం ఉండి..ముందుకు వెళ్లి సక్సెస్ అయ్యిన వారు చాలానే ఉన్నారు. అటువంటి వారి లిస్టులో ఒకరైన..ఫేమస్ యాక్టర్ బొమన్ ఇరానీ(BomanIrani). బాలీవుడ్ తో పాటుగా.. టాలీవుడ్ లోను బోమన్‌ ఇరానీ కు ప్రత్యేక స్థానం ఉంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ కూడా లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన బోమన్‌ ఇరానీ ..లేటెస్ట్గా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూ లో ముఖ్యమైన విషయాలను షేర్ చేసుకున్నారు.   

తన కెరీర్‌ గురించి పంచుకుంటూ.. చిన్నప్పటి నుంచి చదువుపై ఇంట్రెస్ట్ ఉండేది కాదు. పదో తరగతి కంప్లీట్ చేయగానే  హోటల్ మేనేజ్ మెంట్ లో వెయిటర్ గా కోర్స్ పూర్తీ చేశాను. ఆ తర్వాత తాజ్ హోటల్లో కొన్నాళ్ల పాటు రూమ్‌ సర్వీస్ బాయ్ గా, వెయిటర్ గా అక్కడే జాబ్ చేశాను. అలా పనిచేస్తున్న టైంలోనే తన తల్లి అనుకోని ప్రమాదంలో మరణించడంతో..ఇంటి దగ్గరే చిన్న దుకాణంను నడిపిస్తూ ఉండేవాడిని అని చెప్పుకొచ్చారు.

ఇక ఆ తరవాత పెళ్లి..ఖర్చులకు డబ్బులు సరిపోకపోవడంతో ఫోటోగ్రాఫర్ గా మారి..కొన్ని యాడ్స్ చేశానని..అలా 180 కి పైగా యాడ్స్ లో కూడా నటించానని ఇరానీ తెలిపారు.ఆ తర్వాత యాడ్స్ లో నా యాక్టింగ్ చూసిన కొంత మంది మేకర్స్ ద్వారా.. హిందీలో రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్ లో వచ్చిన మున్నా భాయ్ ఎంబీబీఎస్ మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాకు గాను రూ.2 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు..ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నానని పేర్కొన్నారు. 3 ఇడియట్స్, హౌస్‌ఫుల్ ఫ్రాంచైజ్, జాలీ LLB..పలు మూవీస్ లో నటించారు 

బోమన్ ఇరానీ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీలో కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చిందని..ఇలా రవితేజ బెంగాల్ టైగర్..అల్లు అర్జున్ నా పేరు సూర్య అలాగే పవన్ అజ్ఞాతవాసి సినిమాల్లో కూడా ఈయన నటించి మెప్పించాడు. 

ALSO READ : Cricket World Cup 2023: పాకిస్తాన్‌పై ఎలాగూ రాణిస్తా.. ముందు మా అమ్మను కలవాలి: బుమ్రా