T 20 World Cup: ఇటలీ టార్గెట్ 208.. డీసెంట్ స్కోర్ కొట్టిన స్కాట్లాండ్

T 20 World Cup: ఇటలీ టార్గెట్ 208.. డీసెంట్ స్కోర్ కొట్టిన స్కాట్లాండ్

టీ 20 వరల్డ్ కప్‎లో మరో ఆసక్తికరమైన మ్యాచ్. స్కాట్లాండ్ Vs ఇటలీ మధ్య తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఇటలీ.. ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నది. 20 ఓవర్లు ఆడిన స్కాట్లాండ్.. నాలుగు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. 

స్కాట్లాండ్ ఓపెనర్ జార్జ్ మున్సీ 54 బంతుల్లో 84 పరుగులు చేశాడు. 13 ఫోర్లు, 2 సిక్స్ లతో చెలరేగి ఆడాడు. మైకల్ జోన్స్ 30 బాల్స్ లో 37 పరుగులు చేయగా.. బ్రాండెన్ మెక్ ములన్ 18 బంతుల్లోనే 41 పరుగులు చేశారు. బ్రాండెడ్ మెక్ ములన్ ఏకంగా 4 సిక్సులు కొట్టి.. జట్టు స్కోర్ పరుగులు పెట్టించాడు. జస్ట్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయిన స్కాట్లాండ్ 207 పరుగులు చేసి.. ప్రత్యర్థి ఇటలీ జట్టుకు 208 పరుగులు టార్గెట్ విధించింది. 

ఇక ఇటలీ బౌలర్లు తలో వికెట్ తీశారు. అలీ హసన్, గ్రాంట్ స్టివార్ట్, థామస్ డ్రాకా, జేజే స్మట్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. స్కాట్లాండ్ జట్టు వికెట్లు తీయకపోయినా.. కట్టుదిట్టమైన బౌలింగ్ తో పరుగులను ఆపగలిగారు ఇటలీ బౌలర్లు.

స్కాట్లాండ్ ఫస్ట్ వికెట్ పడగొట్టటానికి ఇటలీ నానా కష్టాలు పడింది. 126 పరుగులకు ఫస్ట్ వికెట్ పడింది. ఆ తర్వాత వరసగా వికెట్లు పడటంతో.. స్కాట్లాండ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఫస్ట్ వికెట్ పడకముందు.. స్కాట్లాండ్ దూకుడు చూస్తే కనీసం 250 పరుగులు చేస్తుందని అంచనా వేశారు. 126 పరుగుల నుంచి 207 పరుగుల వరకు వరసగా 4 వికెట్లు పడటంతో.. స్కోర్ కొంచెం తగ్గింది. స్కాట్లాండ్ విసిరిన 208 పరుగుల లక్ష్యాన్ని ఇటలీ ఛేజ్ చేస్తుందో లేదో చూడాలి..