Good Health:  ఇవి ఎన్నైనా తినొచ్చు.. అస్సలు బరువు పెరగరు.. ఇమ్యూనిటి పవర్ కూడా పెరుగుతుంది..! 

Good Health:  ఇవి ఎన్నైనా తినొచ్చు.. అస్సలు బరువు పెరగరు.. ఇమ్యూనిటి పవర్ కూడా పెరుగుతుంది..! 

రోజూ మనం తినే ఆహారపదార్థాల వల్ల శరీరానికి శక్తి క్యాలరీల రూపంలో అందుతుందని అందరికీ తెలిసిందే. అయితే, ఎక్కువ క్యాలరీలున్న ఆహారం తింటే బరువు పెరుగుతారు. తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తింటే బరువును అదుపులో ఉంచుకోవచ్చు. తినే ఆహారంలో జీరో క్యాలరీలు ఇచ్చే ఫుడ్స్ చాలా ఉన్నాయి. మరి వీటిలో క్యాలరీలే ఉండవా? అంటే చాలా తక్కువ మోతాదులో ఉంటాయి..  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .!

నారింజ : నారింజ పండ్లు అనేక సమస్యల నుంచి రక్షిస్తాయి. వీటిలో  పీచు పదార్థంతో పాటు వ్యాధి నిరోధకత పెంచే పోషకాలు ఎక్కువ. క్యాలరీలు తక్కువ కావడం వల్ల వీటిని కాస్త ఎక్కువగా తిన్నా నష్టం లేదు. 

100 గ్రాముల నారింజల్లో కేవలం 47 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నోరకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. నారింజ పండ్లలో విటమిన్ -సీ పుష్కలం ఇది అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుతుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ ను అరికట్టడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

దోసకాయ : దోసకాయల్లో నీటి శాతం ఎక్కువ, క్యాలరీలు తక్కువే. 100 గ్రాముల దోసకాయలో 16 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అధిక బరువును తగ్గించుకునేందుకు ఇవి ఇది చాలా  ఉపయోగపడతాయి

యాపిల్ : యాపిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకో యాపిల్ ను తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం రాదు అంటారు .అయితే, యాపిల్ లో ఉండే పోషక పదార్థాలు బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. 100 గ్రాముల యాపిల్స్ ని తీసుకుంటే 52 క్యాలరీలు వస్తాయి.  

ఉల్లిపాయలు : బరువు తగ్గాలనుకునే వాళ్లకు ఎఫెక్టివ్ గా ఉపయోగపడే ఆహారం ఉల్లిపాయలు . వంద గ్రాముల ఉల్లిపాయల్లో 410 క్యాటరీలు వస్తాయి.

క్యారెట్ : క్యారెట్లు సహజ సిద్ధమైన డైయురెటిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. శరీరంలో ఎక్కువగా ఉండే సోడియాన్ని బయటికి  పంపిస్తాయి. యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలతో పాటు బరువు తగ్గించే గుణాలుంటాయి. 100 గ్రాముల క్యారెట్లలో 41 క్యాలరీలు ఉంటాయి .

నిమ్మకాయ, టొమాటో: ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని రోజులో ఎప్పుడైనా తాగొచ్చు. ఇలా చేస్తే శరీరంలో అదనపు క్యాలరీలు చేరవు.   అంతే కాకుండా శరీరం ఉత్సాహంగా ఉంటుంది. 100 గ్రాముల నిమ్మరసంలో 29 క్యాలరీలు ఉంటాయి. టొమాటో విషయానికొస్తే లైకోపిన్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ రాకుండా చేస్తుంది. గుండె జబ్బులను నిరోధిస్తుంది. బరువు తగ్గేందుకు కూడా చక్కగా ఉపయోగపడతాయి. 100 గ్రాముల టొమాటోలతో  17  క్యాలరీల శక్తి వస్తుంది.  

క్యాబేజీ, క్యాలీఫ్లవర్ :  క్యాబేజీ క్యాన్సర్, గుండె జబ్బులు లాంటివి. రాకుండా చేస్తుంది. 100 గ్రాములు క్యాబేజీ కేవలం 25 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇవి శరీరంలోని అనవసర క్యాలరీలను కరిగిస్తాయి. తక్కువ క్యాలరీలు ఉండే ఆహార పదార్థాల్లో క్యాలీఫ్లవర్ ఒకటి. ఇందులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. గుండె సంబంధ వ్యాధులు రాకుండా చూస్తుంది. జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. 100 గ్రాముల క్యాలీఫ్లవర్లో 25 క్యాలరీలు ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. 

కర్బూజ, పుచ్చకాయ: వేసవి కాలంలో ఎక్కువగా లభించే కర్బూజాలు వేసవి తాపాన్ని తగ్గిస్తాయి. ఆకలిని పెంచేందుకు మూత్రాశయంలో ఇన్ఫెక్షన్లు తగ్గించేందుకు, మలబద్ధకాన్ని నివారించేందుకు ఇది మంచి మందు. వంద గ్రాముల కర్బూజలో పది క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఈ పండులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి హైపర్ టెన్షన్ ను దూరం చేస్తుంది.  ఎ , బి, సీ విటమిన్లు, సోడియం, మెగ్నిషియం ఖనిజాలు ఉంటాయి. ఈ పండులో షుగర్ కంటెంట్ తక్కువ. జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. సహజంగా తీపి ఉండే పుచ్చకాయల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు బాడీ మెటబాలిజాన్ని కూడా వేగవంతం చేస్తుంది. 100 గ్రాముల పుచ్చకాయలో 30 క్యాలరీలు ఉంటాయి..

స్ట్రాబెర్రీ : చూడగానే నోరూరించే స్ట్రాబెర్రీలను తినేందుకు ఎవరైనా ఇష్టపడతాడు. జామ్, స్మూతి, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్. బ్యూటీ ప్రొడెక్ట్స్ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే స్ట్రాబెర్రీల్లో ఉండే పోషక గుణాలు అలాంటివి. అందుకే వీటిని రోజు తిపడం మంచిది, స్ట్రాబెర్రీల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లకి ఇవి బాగా పనిచేస్తాయి. అయితే, వీటిని తినడం పల్ల అధిక క్యాలరీలు ఉండే ఆహరపదార్థాలను ఎక్కువ ఇష్టపడరని కొన్ని పరిశోధనలు చెబతున్నాయి. దీని వల్ల ఆహారం తీసుకోవడంపై కంట్రోల్ ఉంటుంది. దీంతో బరువు తగ్గొచ్చు. 100 గ్రాముల స్ట్రాబెర్రీలతో కేవలం 33 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. వీటితో అరగకపోవడం, మలబద్ధకం, అసిడిటీ లాంటి సమస్యల నుంచి రిలీఫ్ ఉంటుంది. బరువును నియంత్రించే హార్మోన్ల పనితీరును క్రమబద్ధీకరించే ఎల్లాజిక్ యాసిడ్ స్ట్రాబెర్రీల్లో ఎక్కువగా  ఉంటాయి