జస్ట్ ఇంటర్వ్యూతో ICARలో జాబ్స్..నెలకు రూ. 30 వేల జీతం

జస్ట్ ఇంటర్వ్యూతో ICARలో జాబ్స్..నెలకు రూ. 30 వేల జీతం

ఐసీఏఆర్  సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ 

(ఐసీఏఆర్ సీఆర్ఆర్ఐ) యంగ్ ప్రొఫెషనల్ I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ పూర్తిచేసిన అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఫిబ్రవరి 12న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 
ఖాళీలు: 02 ( యంగ్ ప్రొఫెషనల్ I).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బొటనీ, లైఫ్​సెన్స్, ఎన్విరాన్​మెంటల్ సైన్స్​లో బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
వయోపరిమితి: 21 నుంచి 45 ఏండ్ల మధ్యలో ఉండాలి.  కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
వాక్  ఇన్ ఇంటర్వ్యూ: ఫిబ్రవరి 12. 
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు icar-crri.in 
వెబ్​సైట్​ను సందర్శించండి.