ప్రేమికుల రోజున మనసంతా నువ్వే రీ రిలీజ్

ప్రేమికుల రోజున మనసంతా నువ్వే రీ రిలీజ్

ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన ఎవర్‌‌గ్రీన్ రొమాంటిక్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ ‘మనసంతా నువ్వే’.  ఈ సినిమా వచ్చి పాతికేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసుకుంది. ఉదయ్ కిరణ్,  రీమాసేన్,  తనూరాయ్ లీడ్ రోల్స్‌‌లో వీఎన్‌‌ ఆదిత్య తెరకెక్కించిన ఈ ఫీల్‌‌ గుడ్‌‌ లవ్‌‌స్టోరీని ఎం.ఎస్‌‌.రాజు నిర్మించారు. వాలెంటైన్స్‌‌ డే సందర్భంగా ఈ నెల 14న ఈ చిత్రం తిరిగి థియేటర్స్‌‌కు వస్తోంది. ప్రైమ్ షో నిరంజన్ రెడ్డి,  చైతన్యారెడ్డి, శ్రీ మాత క్రియేషన్స్  రఘురామ్ రెడ్డి,  రవికాంత్ రెడ్డి రీ రిలీజ్ చేస్తున్నారు.  

అప్పట్లో రెండొందల యాభై రోజులు సక్సెస్‌‌ఫుల్‌‌గా రన్ అయిన ఈ చిత్రం ఇప్పటి యువతను కూడా ఆకట్టుకుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఇందులో సునీల్,  చంద్రమోహన్,  తనికెళ్ల భరణి, పరుచూరి వేంకటేశ్వరరావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి,  సుధ, మాస్టర్ ఆనందవర్ధన్,  బేబీ సుహానీ ముఖ్యపాత్రలు పోషించారు.  ఆర్పీ పట్నాయక్ సంగీతం, సిరివెన్నెల సాహిత్యం సినిమా సక్సెస్‌‌లో కీరోల్ ప్లే చేశాయి.