టెన్త్ పాసైన వారికి గుడ్ న్యూస్.. HVF AVNL లో జూనియర్ టెక్నీషియన్ పోస్టులు

టెన్త్ పాసైన వారికి గుడ్ న్యూస్.. HVF AVNL లో జూనియర్ టెక్నీషియన్ పోస్టులు

హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ (హెచ్​వీఎన్​​ఏవీఎన్ఎల్) జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 14.

ఖాళీలు: 220 (జూనియర్ టెక్నీషియన్).
విభాగాల వారీగా ఖాళీలు: మెషినిస్ట్ 122, 
ఆపరేటర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్​మెంట్ 55, రిగ్గర్ 25, హీట్ ట్రీట్​మెంట్ ఆపరేటర్ 08, ఫిట్టర్ ఆటో ఎలక్ట్రిక్ 04, సాండ్ అండ్ శాట్ బ్లాస్టర్ 06. 
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఎన్ఏసీ/ ఎన్​టీసీ/ ఎస్​టీసీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: అన్​రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, 
పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. 
లాస్ట్ డే: ఫిబ్రవరి 14. 
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు ddpdoo.gov.in / avnl.co.in వెబ్​సైట్​ను సందర్శించండి.