టాలీవుడ్ సినీ స్టార్స్ హీరోయిన్ శ్రీలీల, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్ శ్రీకృష్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం (2026 ఫిబ్రవరి 9న) తెల్లవారు జామున వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సేవలో వేర్వేరుగా కలిసి మొక్కులు చెల్లించుకున్నారు.
టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ప్రస్తుతం శ్రీలీల తన ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో శ్రీలీల వాళ్ళ అమ్మగారితో కలిసి ఉన్న ఫొటోలతో పాటుగా పూజారుల నుండి ఆశీర్వాదం పొందుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోల్లో శ్రీలీల సాంప్రదాయ వస్త్రాలతో చాలా పద్దతిగా కనిపిస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటోంది.ఈ సందర్భంగా తమ అభిమాన సినీ స్టార్స్ కనిపించడంతో సెల్ఫీలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం శ్రీలీల వరుస ప్రాజెక్ట్స్తో దూసుకెళ్తోంది. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ రాణిస్తుంది. ఇటీవలే శివకార్తికేయన్ పరాశక్తి మూవీతో తమిళ్ కి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ధనుష్ తో మరో తమిళ సినిమా ఛాన్స్ కొట్టేసింది.
అంతేకాకుండా శ్రీలీల త్వరలో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుంది. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ డెబ్యూ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. అలాగే కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో కూడా సెలెక్ట్ అయినట్లు సమాచారం. వీటితో పాటుగా పవన్ కళ్యాణ్తో నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ మార్చి 26న విడుదల కానుంది.
