బీజేపీకి రాహుల్ భయం.. కాంగ్రెస్ ఎంపీల ఆందోళనలో ఎంపీ వంశీకృష్ణ

బీజేపీకి రాహుల్ భయం.. కాంగ్రెస్ ఎంపీల ఆందోళనలో ఎంపీ వంశీకృష్ణ

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లోక్ సభలో మాట్లాడేందుకు సమయం ఇవ్వాలంటూ పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి  ఎంపీలు ఆందోళనకు దిగారు. స్పీకర్ ఏకపక్ష వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  బీజేపీకి రాహుల్ గాంధీ భయం పట్టుకుందన్నారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి సభలో ప్రతి అంశంపై మాట్లాడే హక్కు ఉందన్నారు. సభ సజావుగా నడపకుండా బీజేపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తుందని మండిపడ్డారు వంశీ.

ఫిబ్రవరి 9న సభ ప్రారంభమైన వెంటనే.. చైనా ఆక్రమణలపై చర్చకు పట్టుబడుతూ లోక్ సభలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు.  పోడియం చుట్టూ చేరిన ఎంపీలు స్పీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 మరో వైపు సభలో  రాహుల్ గాంధీని మాట్లడనివ్వకుండా అడ్డుకోవడంపై  అసంతృప్తిగా ఉన్న ఇండియా కూటమి లోక్ సభ స్పీకర్  అవిశ్వాస తీర్మానానిని సిద్దమవుతోంది. రాజ్యాంగంలోని 94సీ ప్రకారం అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అవుతోంది.